Natyam ad

బాధిత బాలికను పరామర్శించిన కొల్లు

మచిలీపట్నం ముచ్చట్లు:
 
మచిలీపట్నంలో లైంగిక దాడికి గురైన బాలికను మాజీ మంత్రి కొల్లు రవీంద్ర శుక్రవారం పరామర్శించారు. ప్రభుత్వ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాలికకు ధైర్యం చెప్పారు. కొల్లు రవీంద్ర మాట్లాడుతూ మచిలీపట్నంలో మహిళా దినోత్సవం జరిగిన మరుసటి రోజున మహిళపై లైంగిక దాడి జరగడం సిగ్గుచేటు. బీచ్ కి వెళ్లిన జంటపై పాశవికంగా దాడి చేయడం దుర్మార్గమని అన్నారు. బాలిక ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు వెనక్కి తీసుకోవాలని ఆమెపై ఒత్తిడి చేస్తున్నారు. దాడికి గురైన బాలికకు ప్రభుత్వం 25 లక్షలు ఆర్ధిక సహాయం చేయాలి. అత్యాచారానికి పాల్పడిన వారికి వైసీపీ నేతలు కొమ్ము కాస్తున్నారు. బాధిత బాలికకు టీడీపీ అండగా ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు… నిత్యం ఎక్కడొకచోట మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయ. దిశా చట్టం ఏమైందో ఎక్కడ ఉందొ ఎవరికి తెలియదు. పోలీసులు స్వేచ్ఛగా పని చేస్తే బాధితులకు న్యాయం జరుగుతుంది. లైంగిక దాడికి గురైన బాలికకు న్యాయం జరిగే వరకు టీడీపీ ప్రభుత్వం పై పోరాటం చేస్తుందని అన్నారు.
 
Tags: Kollu who consulted the victim girl