పుంగనూరులో కుష్టువ్యాధికి నివారణ చర్యలు
పుంగనూరు ముచ్చట్లు:
కుష్టువ్యాధి గ్రస్తులను గుర్తించి, వారికి చికిత్సలు అందించేందుకు సర్వే ప్రారంభించినట్లు కుష్టువ్యాధి నివారణాధికారి డాక్టర్ బాలసాయిరెడ్డి తెలిపారు. మంగళవారం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సల్మాబేగంతో కలసి ఆయన కరపత్రాలు విడుదల చేశారు. డాక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వాదేశాల మేరకు డిసెంబర్ 5 వరకు వైద్య సిబ్బంది, ఆశ వర్కర్లు, తదితర ఏఎన్‌ఎంలతో కలసి ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహించడం జరుగుతుందన్నారు. కుష్టువ్యాధి లక్షణాలు కలిగిన వారిని గుర్తించి, వారికి ప్రత్యేక చికిత్సలు చేయనున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ విషయమై అవగాహన కలిగి సమాచారం అందించి, కుష్టువ్యాధి నివారణకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీపీఎంవో దేవదాసు, వైద్యబృందం హరినాథరెడ్డి, మురళి, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

Tags: Preventive measures against leprosy in Punganur
