మండుతున్న ప‌ప్పుదినుస‌ల ధ‌ర‌లు

Date;15/09/2020

వ‌రంగ‌ల్ ముచ్చట్లు:

కరోనా కష్టాలు ఇబ్బంది పడుతున్న వినియోదారులు మార్కెట్లో పప్పు ధాన్యాల ధరలు పెరగడంతో మరింత ఇబ్బంది పడుతున్నారు. అలసే పెరిగిన ధరలతో సామాన్యుడు సతమతం అవుతుంటే వాటి ధరను రిటైల్ వర్తకులు మరింత పెంచి నిలువునా దోచుకుంటున్నారు. పప్పు ధాన్యాల రేట్లు పెరగడం వినియోగ దారులకు శాపం అయినప్పటికి రిటైల్ వర్తకులకు మాత్రం అది వరంగా మారుతోంది. దాంతో నగరంలోని రిటైల్ వ్యాపారులు పప్పు ధాన్యాల ధరలను అమాంతంగా పెంచుతూ ఫస్ట్,సెకండ్ ,థర్డ్ క్వాల్టీ పేరుతో విభజించి ఇష్టాను సారంగా ధరలు నిర్ణయించారు. నాణ్యమైన కంది పప్పు కిలో రూ. 90. రెండో రకం కిలో రూ.80, మూడో రకం రూ.70 చొప్పున అమ్మకాలు కొనసాగిస్తున్నారు. కొందరు రేషన్ షాప్ డీలర్లు కందిపప్పును కిలో రూ.70 నుంచి 90 చొప్పున గుట్టుగా రిటైల్ వ్యాపారులకు చేరవేస్తూ వాటిని నాణ్యమైన పప్పులో కలిపి విక్రయిస్తున్నారే విమర్శలు వస్తున్నాయి.మరి కొందరు వ్యాపారులు రెండు క్వింటాళ్ళ గ్రేడ్ 1 రకం కంది పప్పులో 1 క్వింటాల్ గ్రేడ్ 2ను కలిపి బెస్ట్ క్వాల్టీగా విక్రయిస్తున్నట్లు సమాచారం.

 

పప్పుల ధర విషయంలో నగరవాసులను నిలువుగా దోచుకుంటుంది మాత్రం రిటైల్ వర్తకులే. సాధారణంగా హొల్‌సేల్ ధరకు రిటైల్ ధరకు మధ్య తేడా రూ.4 కు మించి ఉండదు. కాని వాస్తవ పరిస్థితి దీనికి విరుద్దంగా వుంది. శనగ,మినప,పెసర పప్పు ధరల్లో హోల్‌సేల్ ధరలతో పోలిస్తే రిటైల్ వ్యాపారుల వద్ద కిలోకు రూ.10 నుంచి 18 తేడా ఉన్నాయంటే రిటైల్ వ్యాపారులు వినియోగ దారులు ఏ విధంగా మోసం చేస్తున్నారో అర్థం అవుతోంది. ఉదాహరణకు హోల్‌సేల్ మార్కెట్లో మినపప్పు కిలో రూ.

 

120 నుంచి 140 వుండగా రిటైల్లో కిలో రూ.170 వసులు చేస్తున్నారు. ఈ విధంగా ఒక్క మినపప్పు మాత్రమే కాదు పెసరపప్పు, శనగ పప్పు, ఎర్రపప్పు,పుట్నాలు, పల్లీలు ధరల్లో కిలోకి రూ. 10 నుంచి 18 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు.నగరంలో సుమారు ప్రతి రోజు 50 నుంచి 60 టన్నుల కందిపప్పు వినియోస్తుండగా మినపప్పు 60 నుంచి 70 టన్నులు,శనగ ,పెసర పప్పులు రోజుకు 30 నుంచి 35 టన్నులు వినియోగం జరుగుతోంది. జనవరిలో కొత్తం పంట చేతికి అందుతుందని అప్పటి వరకు ధర దిగివచ్చే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. నగరంలోని పలు రైతు బాజర్లలో స్వయం సహాయక సంఘాలు నడుస్తున్నా దుకాణాల్లో ఇదే తంతు కోనసాగుతుంది. నాణ్యతలో రెండు పేర్లు చెప్పి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు.. నగరంలో ప్రధానమైన ఎర్రగడ్డ, మెహదీపట్నం ,సరూర్‌నగర్,కూకట్‌పల్లి,వనస్థలిపురం, ఫలక్‌నుమా, రైతు బజరాల్లో పప్పు ధాన్యాల ధరలు సామాన్యునికి ఏ మాత్రం అందుబాటులో లేవు. ఏది ఏమైనప్పటికి మార్కెటింగ్ శాఖ అధికారులు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా వుంది.

 

 

మళ్లీ ఆగిన మల్లన్న సాగర్ పనులు

Tags:Prices of fiery popcorn

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *