Natyam ad

అర్చకులు ఆదర్శంగా ఉండాలి- టీటీడీ జేఈవో సదా భార్గవి

తిరుపతి ముచ్చట్లు:

 

సనాతన హిందూ ధర్మంలో అర్చకులకు గౌరవ స్థానం ఉందని టీటీడీ జేఈవో   సదా భార్గవి చెప్పారు. అర్చకులు తమ హావ, భావాలు, ఆహార్యం, వేష, భాషల్లో సంప్రదాయాలు పాటిస్తూ అందరికీ ఆదర్శంగా ఉండాలని ఆమె కోరారు.శ్వేత ఆధ్వర్యంలో ఎస్వీ వేద విశ్వవిద్యాలయంలో టీటీడీ అర్చకులకు మూడు రోజుల పునశ్చరణ తరగతులు గురువారం ప్రారంభం అయ్యాయి. ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జేఈవో  సదా భార్గవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అర్చకులు అప్పుడప్పుడూ ఇలాంటి పునశ్చరణ తరగతుల్లో పాల్గొనడం ద్వారా తమకు తెలిసిన విషయాలు ఇతరులతో పంచుకోవడం, తెలియని విషయాలు తెలుసుకోవడానికి ఉపయోగంగా ఉంటుందన్నారు. పదేళ్ళ తరువాత అర్చకులకు ఇలాంటి పునశ్చరణ తరగతులు నిర్వహించడం సంతోషమన్నారు. టీటీడీ ఛైర్మన్   వైవి సుబ్బారెడ్డి, ఈవో  ఎవి ధర్మారెడ్డి ప్రోత్సాహంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోని అర్చకులందరికీ విడతల వారీగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించే ఆలోచన చేస్తున్నట్లు జేఈవో వివరించారు. అర్చకులు తమశారీరక దృఢత్వం, ఆరోగ్యం కోసం యోగా కూడా చేయాలని సూచించారు. భారతదేశంలో చేతులెత్తి మొక్కే వృత్తి అర్చకత్వం మాత్రమేనని, వీరు అందరికీ ఆదర్శంగా ఉండాలని ఆమె కోరారు. శ్వేతలో ఇటీవల కాలంలో భిన్న రంగాల వారికి శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అర్చక శిక్షణ లాంటి కార్యక్రమాలు దేశంలో పెద్ద ఎత్తున నిర్వహించే శక్తి టీటీడీకి మాత్రమే ఉందన్నారు.ఆగమ సలహాదారులు
శ్రీ వేదాంతం విష్ణు భట్టాచార్య,  సీతారామాచార్యులు, వేద విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య రాధేశ్యామ్, శ్వేత డైరెక్టర్  ప్రశాంతి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

Tags: Priests should be exemplary – TTD JEO Sada Bhargavi

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.