Natyam ad

సేగు రెడ్డెప్ప రెడ్డీకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందన

హర్షం వ్యక్తం చేసిన బీటీ కాలేజీ పూర్వ విద్యార్థులు

 

 

మదనపల్లి ముచ్చట్లు:

 

 

చిత్తూరు జిల్లా మదనపల్లి లో ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీలో పొలిటికల్ సైన్స్ అధ్యాపకులు, ఎన్ ఎస్ ఎస్ కో ఆర్డినేటర్ సేగు రెడ్డెప్ప రెడ్డి చేస్తున్న సేవలను గుర్తిస్తూ దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అభినందన లేఖ పంపారు. కాలేజీలో ఎన్ ఎస్ ఎస్ విభాగంలోని విద్యార్థులను సామాజిక సేవా కార్యక్రమాలల్లో భాగస్వాములు చేయడం తో బాటు ప్రజలకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ప్రధాన మంత్రి అభినందనలు తెలియచేసారు. బీ టీ కాలేజీ పూర్వ విద్యార్థుల హర్షం. బీటీ కాలేజీ మాజీ విద్యార్ధి ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీలో ఎన్ ఎస్ ఎస్ కో ఆర్డినేటర్ గా పని చేస్తున్న సేగు రెడ్డెప్పరెడ్డికి చేసిన సేవలను గుర్తించి ప్రధాని నరేంద్ర మోడీ అభినందన లేఖ పంపడాన్ని బీటీ కాలేజీ పూర్వ విద్యార్థులు నారపరెడ్డి రాజారెడ్డి, పి. శ్రీనివాసులు(ఆదరణ ), ఎం. సి రెడ్డెప్ప రెడ్డి, కోన భాస్కర్, నక్క చంద్ర, ఏ. మోహనకుమార్,శ్రీరాములు, పులివెందుల సుబ్రహ్మణ్యం, టీ. కృష్ణప్ప లు హర్షం వక్తం చేసారు. డిగ్రీ చదువు కొనే రోజుల్లోనే 1994 సం. లో ఎన్ ఎస్ ఎస్ ద్వారా మారు మూల కొండ ల్లో ఉన్న కోళ్ల బైలుకి శ్రమదానం ద్వారా బీటీ కాలేజీ విద్యార్థులు అప్పటి ఎన్ ఎస్ ఎస్ కో ఆర్డినేటర్ ప్రస్తుత బీటీ కాలేజీ కరెస్పాండెంట్ వై ఎస్ మునిరత్నం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం లో కీలక భూమిక సేగు వాహించాడని గుర్తు చేసారు. అనేక సార్లు రక్తదానం, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం జరిగిందని గుర్తు్చేశారు.

 

Post Midle

Tags: Prime Minister congratulates Segu Reddappa Reddy

Post Midle