ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఖరారు

విజయవాడ ముచ్చట్లు:

ఈ నెల 12న విజయవాడ కేసరపల్లి IT పార్కు వద్ద జరిగే చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఇందుకోసం ఉ.8.20 గంటలకు ఢిల్లీ నుంచి బయల్దేరి ఉ.10.40 గంటలకు గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రమాణ స్వీకార ప్రాంగణానికి చేరుకుని, ఉ.11 గంటల నుంచి మ.12.30 గంటల వరకు కార్యక్రమంలో పాల్గొంటారు. మ.12.45 గంటలకు విమానంలో భువనేశ్వర్ పర్యటనకు బయల్దేరి వెళ్తారు.

 

 

Tags:Prime Minister Modi’s visit to AP is over

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *