Prime Minister Narendra Modi has been locked down for 21 days.

21 రోజుల పాటు లాక్​డౌన్ ప్రధాని నరేంద్రమోదీ.

Date:25/03/2020

న్యూఢిల్లీ ముచ్చట్లు:

దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్​డౌన్ ప్రకటించారు ప్రధాని నరేంద్రమోదీ.

ఈ నేపథ్యంలో స్పష్టమైన నిబంధనలను కేంద్ర హోంశాఖ విడుదల చేసింది.

జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (ఎన్​డీఎంఏ)కు అధికారాలు కట్టబెడుతూ ఉత్తర్వులతో పాటు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది.

అవి ఇలా ఉన్నాయి.

రక్షణ, కేంద్ర పారా మిలిటరీ బలగాలు, ట్రెజరీ, ఇంధన, గ్యాస్, విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, తపాలా సేవలు, జాతీయ సమాచార వ్యవస్థ, ముందస్తు హెచ్చరికల కేంద్రాలు, విపత్తు నిర్వహణ మినహా అన్ని కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ, స్వతంత్ర వ్యవస్థలను మూసివేయాలి.

రాష్ట్రాల్లో పోలీసు, హోం గార్డ్స్, పౌర రక్షణ, అగ్నిమాపక, అత్యవసర సేవలు, జైళ్లు, జిల్లా పరిపాలన, ట్రెజరీ, విద్యుత్, నీరు, పారిశుద్ధ్యం, మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్యం నిర్వహణ, నీటి సరఫరా మినహా అన్ని సేవలు బంద్.

ఆసుపత్రి, అనుబంధ వ్యవస్థల నిర్వహణ, ఔషధ దుకాణాలు, వైద్య పరికరాల దుకాణాలు, ల్యాబ్​లు, అంబులెన్సులు, వైద్య రంగంలో పనిచేసే సిబ్బందికి మినహాయింపు ఉంటుంది.

రేషన్ దుకాణాలు, ఆహార పదార్థాలు, పండ్లు, కూరగాయలు, పాలు, మాంసం, చేపల దుకాణాలు తెరిచి ఉంటాయి.

అవకాశం ఉన్నంత వరకు స్థానిక పాలన యంత్రాంగం నిత్య అవసరాలను ఇళ్లకే సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టాలి.

బ్యాంకులు, బీమా కార్యాలయాలు, ఏటీఎంలు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, టెలీ కమ్యూనికేషన్ ఇంటర్నెట్ వ్యవస్థలు, కేబుల్ సేవలు కొనసాగుతాయి.

ఆహార పదార్థాలు, ఔషధాలు, వైద్య పరికరాలు ఈ- కామర్స్ ద్వారా సరఫరా చేసే వారికి మినహాయింపు ఇచ్చారు.

పెట్రోల్ పంపు, గ్యాస్ కేంద్రాలు యథావిధిగా నడుస్తాయి.

క్షేత్ర స్థాయిలో విద్యుత్ రంగ సేవల్లో పనిచేసే వారికి మినహాయింపు ఉంటుంది.

కోల్డ్ స్టోరేజ్​లు, గిడ్డంగులు, నిత్యావసరాల తయారీ యూనిట్లు, ప్రయివేటు సెక్యూరిటీ ఏజెన్సీలకు మినహాయింపులు ఇచ్చారు.

ఇతర ఉత్పత్తుల సంస్థలు విధిగా రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిందే.

అత్యవసర రవాణా సేవలు మినహా మిగిలిన రవాణా వ్యవస్థలన్నీ నిలిపివేత.

అన్ని విద్యా, పరిశోధన, శిక్షణ సంస్థలన్నీ మూసివేయాల్సి ఉంటుంది.

అన్ని మత సంబంధిత స్థలాలు మూసివేయాలి. మత పరమైన కార్యక్రమాలకు ఎటువంటి మినహాయింపులు లేవు.

అన్ని సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, విద్య, సాంస్కృతిక కార్యక్రమాలు రద్దు.

ఫిబ్రవరి 15 తరువాత విదేశాల నుంచి వచ్చిన వారు ఎవరైనా అధికారుల సూచన మేరకు వ్యవహరించాలి. అధికారులు సూచించిన విధంగా ఇంటికి కానీ లేదా నిర్బంధ కేంద్రాలకు పరిమితమవ్వాలి. ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు చేసే సూచనలను పౌరులు పాటించాలి.

సామాజిక దూరం కొనసాగించాలి. అన్ని సంస్థలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడుచుకోవాలి. ఉద్యోగులకు కొవిడ్-19 వ్యాధి సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

స్థానికంగా ఈ నిబంధనలను అమలు చేసే వారు మినహాయింపులు తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకొని వ్యవహరించాలి.

ఈ అర్ధరాత్రి నుంచి నిబంధనలు పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తాయి. 21 రోజుల పాటు నిబంధనలను కచ్చితంగా అమలు చేయాల్సిందే. జిల్లా న్యాయాధికారి కమాండర్​గా వ్యవహరిస్తూ నిబంధనలన్ని సక్రమంగా అమలు అయ్యేలా చూడాలి.

ఉల్లంఘనలకు కమాండర్​లే బాధ్యులు అవుతారు.

నిబంధనలు ఉల్లంఘించిన వారు ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం శిక్షార్హులు.

వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఉగాది శుభాకాంక్షలు

Tags: Prime Minister Narendra Modi has been locked down for 21 days.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *