ప్రధాని నరేంద్ర మోడీ,కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం

హైదరాబాద్ ముచ్చట్లు:

మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో కొత్తపేట లోని బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ముందు  దిష్టిబొమ్మలు దహనం చేసే సమయం లో ప్రధాని మోదీ దిష్టి బొమ్మ ను పోలీసులు తీసుకు వెళ్ళడంతో,వెంట తెచ్చుకున్న కేసీఆర్ దిష్టి బొమ్మ ను దహనం చేశారు కాంగ్రెస్ నాయకులు. సోనియా గాంధీ,రాహుల్ గాంధీ పై కేంద్రం లో నరేంద్ర మోడీ అవలంబిస్తున్న కక్ష సాధింపులు చర్యలను వెంటనే మానుకోవాలని సూచించారు. శాంతియుతంగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపడుతున్న నిరసన కార్యక్రమాలకు పోలీసులు అడ్డుతగిలి అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ టిఆర్ఎస్ పార్టీకి వత్తాసు పోలీసులు పలుకుతున్నారని మండిపడ్డారు. అరెస్టులకు,లాఠీచార్జి లకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎవరు భయపడరు అని అన్నారు.  రాబోయే రోజులలో రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహిస్తుందని తెలిపారు.  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి నీచా రాజకీయాలకు పాల్పడుతున్న టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని, అవినీతిపరులను జైలుకు పంపిస్తామని  అన్నారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Prime Minister Narendra Modi, KCR effigy burning

Post Midle
Post Midle
Natyam ad