నవంబర్ 11న విశాఖకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
-డిసెంబరులో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటన
-డిసెంబరు 4న తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో నౌకా దినోత్సవం
విశాఖపట్నం ముచ్చట్లు:
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నవంబరు 11న విశాఖపట్నం రానున్నారు. రూ.400 కోట్లతో చేపట్టనున్న విశాఖ రైల్వేస్టేషన్ నవీకరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. ఈ మేరకు రైల్వే అధికారులకు వివరాలు అందాయి. కేంద్ర ప్రభుత్వ శాఖల పరంగా చేపట్టనున్న మరికొన్ని కార్యక్రమాలకు అదే రోజు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేస్తారు. విశాఖలో జరగనున్న బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో సభ ఏర్పాటు చేయాలని యంత్రాంగం భావిస్తోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రధాని పర్యటనలో పాల్గొంటారు. . ప్రధాని పర్యటన నేపథ్యంలో చేయాల్సిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున, జేసీ విశ్వనాథన్, జీవీఎంసీ కమిషనర్ రాజాబాబు, ఇతర అధికారులు ప్రాథమికంగా చర్చించారు.డిసెంబరులో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటన
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము డిసెంబరులో విశాఖ వచ్చే అవకాశం ఉంది. డిసెంబరు 4న తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో నౌకా దినోత్సవం జరగనుంది. ఈ వేడుకల్లో రాష్ట్రపతి పాల్గొననున్నారు. పర్యటన పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉంది.

Tags: Prime Minister Narendra Modi to Visakhapatnam on November 11
