భద్రతాదళానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు

Prime Minister Narendra Modi wishes security

Prime Minister Narendra Modi wishes security

Date:01/12/2019

న్యూ ఢిల్లీ ముచ్చట్లు:

భారత సరిహద్దు భద్రతాదళానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం బీఎస్ఎఫ్ రైజింగ్ డే సందర్భంగా ఆయన ట్విటర్ వేదికగా సైనికులకు, వారి కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపారు. సరిహద్దుల్లో అత్యంత అప్రమత్తంగా పహారా కాస్తూ బీఎస్ఎప్ సిబ్బంది దేశానికి సేవలందిస్తోందని ప్రధాని కొనియాడారు.‘బీఎస్‌ఎఫ్ రైజింగ్ డే సందర్భంగా సిబ్బందికి, వారి కుటుంబాలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సరిహద్దులను ఎంతో అప్రమత్తంగా వారు కాపాడుతున్నారు. అంతే కాదు, ప్రకృతి విపత్తులు, ప్రమాద సమయాల్లోనూ విశేష సేవలు అందిస్తున్నారు. బీఎస్ఎఫ్‌ ఫ్యామిలీకి బెస్ట్ విషెస్’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. సరిహద్దుల భద్రత కోసం 1965 డిసెంబర్ 1న బీఎస్‌ఎఫ్‌ ఆవిర్భవించింది. హోం శాఖ నియంత్రణలో బీఎస్ఎఫ్ పని చేస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద సరిహద్దు భద్రతా దళంగా బీఎస్ఎఫ్ నిలుస్తోంది.

 

శ్రీ పద్మావతి అమ్మవారికి ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి పట్టువస్త్రాల సమర్పణ

 

Tags:Prime Minister Narendra Modi wishes security

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *