ఓటు హక్కును వినియోగించుకున్న ప్రధాని
అహ్మదాబాద్ ముచ్చట్లు:
ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గుజరాత్లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగింది. ఈ విడతలో 14 జిల్లాల్లోని 93 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ కొనసాగింది. బరిలో 833 మంది అభ్యర్థులుండగా 2.54 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. మరోవైపు అహ్నదాబాద్ లో ప్రధాని మోదీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 89 అసెంబ్లీ స్థానాలకు ఈనెల 1న పోలింగ్ పూర్తయిన విషయం తెలిసిందే.
అహ్మదాబాద్ లోని రానిప్ ప్రాంతంలోని నిషాన్ హై స్కూల్ లో అయన ఉదయం తన ఓటునువేసారు. అందుకుగాను అయన కొంతసేపు లైన్ లో నిలబడ్డారు. పోలింగ్ బూత్ నుంచి బయటకు వచ్చిన మోడీ ఓటు వేసినట్లు బయట ప్రజలకు తన వేలును చేసించారు. తరువాత అయన అక్కడికి దగ్గరలో వున్న తన సోదరుడు సోమ మోడీ ఇంటికి నడుచుకుంటూవెళ్లారు.
Tags: Prime Minister who exercised the right to vote

