Natyam ad

విశాఖలో ప్రధాని రోడ్ షో

విశాఖపట్నం ముచ్చట్లు:


భారత ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి ఆంధ్రప్రదేశ్కు రానున్నారు.. విశాఖలో రెండు రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగనుంది.. ఇక, ప్రధానికి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు సిద్ధం అవుతోంది ఏపీ బీజేపీ.. మరోవైపు.. ప్రధాని మోడీ.. వైజాగ్ పర్యటనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎంపీ జీవీఎల్ నరసింహారావు.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. 11వ తేదీ రాత్రి ప్రధాని విశాఖ చేరుకోగానే రోడ్ షో నిర్వహిస్తామని, కంచెర్లపాలెం నుండి ఓల్డ్ ఐటీఐ వరకూ కిలోమీటర్ మేర ఈ రోడ్షో ఉంటుందన్నారు.. రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకూ రోడ్ షో జరుగుతుందని.. 11న రాత్రి ఐఎన్ఎస్ చోళలో ప్రధాని బస చేస్తారని తెలిపారు. 12న 9 ప్రాజెక్టులకు శంఖుస్థాపన చేస్తారని,ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు.. ఇందులో 152 కోట్లతో చేపట్టే విశాఖ ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణ ముఖ్యమైందని అన్నారు.రాయ్ పూర్-విశాఖ ఎకనామిక్ కారిడార్, విశాఖ రైల్వే స్టేషన్ ఆధునీకరణ , కాన్వెంట్ జంక్షన్ నుండి షీలా నగర్ వరకూ డైరెక్ట్ రోడ్, గైయిల్ ద్వారా శ్రీకాకుళం నుండి ఒడిశాలోని ఒంగుల్ వరకూ పైప్ లైన్ నిర్మాణం, గుంతకల్లులో ఐవోసీఎల్ చేపడుతున్న ప్రాజెక్ట్ను జాతికి అంకితం చెయ్యడం లాంటివి ఉన్నాయని వెల్లడించారు జీవీఎల్.ఆంధ్రప్రదేశ్లో మిగిలిన రైల్వే లైన్స్ అభివృద్ధి నిలిచిపోవడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వక పోవడమేనని ఆరోపించిన ఆయన.. కనీసం పీఎం సమక్షంలోనన్నా సీఎం వైఎస్ జగన్ వీటికి హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరోవైపు.. ప్రధాని పర్యటనలో రాజధాని అంశం లేదని స్పష్టం చేశారు జీవీఎల్.. కేవలం కేంద్ర ప్రభుత్వానికి చెందిన అంశాలే ఉంటాయన్న ఆయన.. రైల్వే జోన్ను ఇప్పటికే ప్రకటించామని,త్వరలో దీనిపై ప్రత్యేకంగా వేరే ప్రకటన ఉంటుందన్నారు.జనసేన అధినేత పవన్ కల్యాణ్కు ఆహ్వానించడంపై పీఎంవో నిర్ణయం తీసుకుంటుందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఇష్యు ఈ పర్యటనలో లేదని స్పష్టం చేశారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు.

 

Tags: Prime Minister’s Road Show in Visakhapatnam

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.