బెంగాల్, అస్సోంలలో ప్రధాని టూర్

Date:22/01/2021

న్యూఢిల్లీ ముచ్చట్లు:

ప్రధాని నరేంద్ర మోదీ శనివారం పశ్చిమ బెంగాల్‌, అసోం రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. కోల్‌కతాలో నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌ జయంతి సందర్భంగా నిర్వహించే ‘పరాక్రమ్‌ దివస్‌’లో పాల్గొని ప్రసగించనున్నారు. నేతాజీ దేశానికి చేసిన నిస్వార్థ సేవను గౌరవించేందుకు, గుర్తు చేసుకునేందుకు నేతాజీ పుట్టిన రోజును ‘పరాక్రమ్‌ దివస్‌’గా జరపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా నేతాజీ ప్రొజెక్షన్ మ్యాపింగ్ షోను ప్రారంభించడంతో పాటు స్మారక నాణెం, తపాళా స్టాంప్‌ను విడుదల చేయనున్నారు. అలాగే కోల్‌కతాలోని నేషనల్‌ లైబ్రరీని సందర్శించనున్నారు. ఇక్కడ కళాకారులు, సమావేశంలో పాల్గొనే వారితో ప్రధాని సంభాషించనున్నారు. అసోంలో శివసాగర్‌లో 1.06లక్షల మందికి భూ కేటాయింపు పత్రాలను పంపిణీ చేయనున్నారు. అసోంలో 2016లో 5.75లక్షల మంది భూమి లేని కుటుంబాలకు.. భూమి కేటాయించి వారికి భద్రతను కల్పించాలని సంకల్పంచింది. గత మే నుంచి 2.28లక్షల మందికి పట్టాలు పంపిణీ చేసింది. తాజాగా మరో లక్ష మందికి పట్టాలను ప్రధాని చేతుల మీదుగా పంపిణీ చేయనుంది.

పుంగనూరులో జగనన్న కాలనీలో లబ్ధిదారులకు పట్టాలపై పరిశీలన

Tags: Prime Minister’s tour of Bengal and Assam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *