A fan who built a temple for Modi

ప్రధాని హైదరాబాద్ పర్యటన: మారిన ప్రోటోకాల్. 

Date:28/11/2020

హైదరాబాద్  ముచ్చట్లు:

ప్రధాని మోడీ ఈరోజు హైదరాబాద్ వస్తున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రధాని మోడీ హాకిం పేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి భారత్ బయోటెక్ సంస్థ కార్యాలయానికి వెళ్లి అక్కడ వ్యాక్సిన్ పురోగతిని పరిశీలిస్తారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి ఢిల్లీ వెళ్ళిపోతారు. మాములుగా ప్రధాన మంత్రి రాష్ట్ర పర్యటనకు వచ్చిన సమయంలో విమానాశ్రయం వద్ద రాష్ట్ర ప్రజల తరపున గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు స్వాగతం పలుకుతారు.శనివారం మధ్యాహ్నం హకీంపేట విమానాశ్రయానికి చేరుకునే ప్రధాన మంత్రికి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతం పలుకుతారని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రధాన మంత్రి కార్యాలయానికి సమాచారమిచ్చింది. దీనికి స్పందనగా ప్రధాన మంత్రి కార్యాలయం నుండి రాష్ట్ర ప్రభుత్వానికి శుక్రవారం సాయంత్రం ప్రత్యేక సమాచారం అందింది.

 

 

ప్రధాన మంత్రికి స్వాగతం పలకడానికి ముఖ్యమంత్రి రవాల్సిన అవసరం లేదని ప్రధాన మంత్రి వ్యక్తిగత సహాయకుడు వివేక్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు ఫోన్ చేసి చెప్పారు.అంతే కాకుండా ప్రధాన మంత్రికి స్వాగతం చెప్పడానికి కేవలం ఐదుగురికి మాత్రమే పిఎంవో అవకాశం ఇచ్చింది. హకీంపేట ఎయిర్ ఆఫిస్ కమాండెంట్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డి.జి.పి. మహేందర్ రెడ్డి, మేడ్చల్ కలెక్టర్ శ్వేతామొహంతి, సైబరాబాద్ సి.పి. సజ్జనార్ లు మాత్రమే హకీంపేట విమానాశ్రయానకి రావాలని పిఎంవో ఆదేశాలు పంపింది. దీంతో తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం అవాక్కయ్యింది. గతంలో ఏ ప్రధాన మంత్రి అయినా రాష్ట్రాల్లో అధికారిక పర్యటన జరపడానికి వస్తే గవర్నర్, ముఖ్యమంత్రి, ఇతర ప్రముఖులు స్వాగతం చెప్తారు. కానీ ఈ సారి స్వాగతం పలకడానికి ముఖ్యమంత్రి రావాల్సిన అవసరం లేదని ప్రధాన మంత్రి కార్యాలయం చెప్పడం విశేషం. ప్రధాన మంత్రి కార్యాలయం నుండి గతంలో ఇలాంటి ఆదేశాలు ఎన్నడూ రాలేదని, ఇలా ఎందుకు చేశారో అర్ధం కావడం లేదని సీనియర్ అధికారులు వ్యాఖ్యానించారు.

 కార్తిక మాస దీక్ష కార్యక్రమం వివరాలు

Tags:Prime Minister’s visit to Hyderabad: Changed protocol.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *