ఔషధ మొక్కలకు ప్రాధాన్యత

Priority to medicinal plants

Priority to medicinal plants

Date:13/07/2018
మంచిర్యాల ముచ్చట్లు:
కొంతకాలంగా అడవుల విస్తీర్ణం తగ్గిపోతోంది. దీంతో అరుదైన జాతుల వృక్షాలు కనుమరుగవుతున్నాయి. ఈ సమస్యను పరిష్కారించేందుకు ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని అమలుచేస్తోంది. ఇక అరుదైన వృక్షజాతులను పరిరక్షించేందుకూ ప్రాధాన్యతనిస్తోంది. దీనిలో భాగంగా అధికారులు అంతరించిపోతున్న జాతులతో పాటు ఔషధ గుణాలున్న మొక్కలు, వివిధ పండ్ల మొక్కలు కూడా పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మంచిర్యాల జిల్లా మొత్తం పచ్చదనానికి కేంద్రంగా ఉండేలా ప్రణాళికలు వేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా లక్షలాది మొక్కలను నాటుతున్నారు. ఈ ఏడాది కూడా పెద్దమొత్తంలో మొక్కలను నాటాలని ప్లాన్ చేశారు. అడవుల్లోనూ మొక్కలు నాటేలా చర్యలు తీసుకుంటున్నారు. నాలుగో విడత హరిత హారంలో అరుదైన జాతులతో పాటు పండ్ల మొక్కలకు ప్రాధాన్యమిచ్చారు. కనుమరుగువుతున్న వృక్షసంపదకు జీవం పోస్తున్నారు అటవీ అధికారులు. వీటితో పాటు కొండమామిడి, తెల్లమద్ది, సుగంధగుణపాలు, ఆరె, తప్సి, బుడ్డధరిణి చెట్లు, తీగ రకాలైన నెమలినార, తిప్పతీగ లాంటివి కూడా గత సంవత్సరం నాటగా, ఈసారి కూడా పెద్ద ఎత్తున నాటేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పలు రకాల పండ్లు, పూలు, జీవవైవిధ్యం కాపాడే జాతుల మొక్కలను కూడా ఈసారి నాటేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలో కొన్ని ప్రాంతాలకే పరిమితమైన నారేపా చెట్లు ముందుముందు జిల్లా వ్యాప్తంగా పరచుకోనున్నాయి. కేరళ అడవుల్లో సుమారు 80 శాతం ఔషధ గుణాలున్న వృక్షాలే ఉంటాయి. ఈ స్ఫూర్తితోనే మంచిర్యాలలోనూ ఔషధ విలువలున్న మొక్కలు నాటేందుకు ప్రధాన్యతనిస్తున్నట్లు జిల్లా డీఎఫ్ఓ తెలిపారు. మెడిసినల్ వాల్యూస్ ఉన్న వృక్షాలవల్లే కేరళలో ప్రకృతి సమతుల్యత బాగుంటుందని వివరించారు. అందుకే ఆ రాష్ట్రంలో ప్రజలు కూడా ఎక్కువ శాతం మంది ఆరోగ్యవంతులుగా ఉంటారని చెప్తున్నారు. ఇక్కడ కూడా గత రెండుమూడేళ్లుగా ఇలాంటి చర్యలే చేపడుతున్నాం. ఔషధ గుణాలతో పాటు అంతరించిపోతున్న అటవీ జాతుల మొక్కలను నాటుతున్నామని తెలిపారు. ఇప్పటికే చెన్నూరు, జైపూరు, బెల్లంపల్లి ప్రాంతాల్లో గత రెండు విడతల్లో నాటిన ఇలాంటి మొక్కలు కొంచెం పెరిగి పెద్దవైనట్లు వెల్లడించారు. ఈదఫా పెద్దమొత్తంలో అలాంటి మొక్కలు నాటేందుకు ప్లాన్ చేసినట్లు చెప్పారు. ఏటా 10 నుంచి 15 లక్షల మొక్కలు ఇలాంటివి నాటితే మరో ఆరు, ఏడేళ్లలో జిల్లా అడవులు పూర్వ వైభవాన్ని సంతరించుకుంటాయని అటవీశాఖ భావిస్తోంది. అందుకే అటవీ ప్రాంతాల్లో నాటిన ప్రతి మొక్కను కూడా కాపాడేవిధంగా సంరక్షణ చర్యలు  తీసుకుంటోంది. ప్రకృతి సిద్ధంగా పెరిగే మొక్కలను ఇప్పుడు మనమే నాటాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితులు ఎదురు కాకుండా ఉండాలంటే అందరూ మొక్కలు నాటడాన్ని బాధ్యతగా తీసుకోవాలని పర్యావరణవేత్తలు స్పష్టంచేస్తున్నారు. లేకుంటే.. భవిష్యత్ లో పర్యావరణ సమతౌల్యం దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు.
ఔషధ మొక్కలకు ప్రాధాన్యత https://www.telugumuchatlu.com/priority-to-medicinal-plants/
Tags:Priority to medicinal plants

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *