జైలు శాఖ పెట్రోల్ బంకు ప్రారంభం

Date:18/09/2020

నాగర్ కర్నూలు ముచ్చట్లు:

 

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో ఉప్పునుంతల రోడ్డుపై జైలు  శాఖ పెట్రోల్ పంపును  ఆడిషనల్  డిజిపి భాస్కర్ ప్రారంభించారు.  తరువాత హరితహారంలో భాగంగా పెట్రోల్ బంకు ఆవరణలో చెట్లు నాటారు. జైలు లో శిక్ష అనుభవించి విడుదలైన ఖైధీలకు ఉపాధి కొసం ఈ పెట్రోల్ బంకులు ఏర్పాటు చెశామమని భాస్కర్ అన్నారు.
వారు మళ్ళీ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చేయకుండా ప్రత్యామ్నాయంగా ఉపాధి కోసం ఈ బంకులు ఏర్పాటు చేశామని తెలిపారు.  ముఖ్యంగా శిక్ష అనుభవించి విడుదల అయిన ఖైదీలకు మాత్రమే  ప్రవేశం ఉంటుందని అన్నారు. మన ఉమ్మడిజిల్లాలో మూడు పెట్రోల్ బంకులు ఉన్నాయి . అచ్చంపేటలో ఇది మూడో పెట్రోల్ బంకు . తెలంగాణ రాష్ట్రంలో  ఇది 21 వది. ఇక్కడ  దాదాపు 240 మంది ఖైదీలు ఉపాధి పొందున్నారు. ఇంకా ఎవరైనా ఉంటే  సంబంధిత అధికారులకు కలిసి ఉపాధి పొందవచ్చని అడిషనల్ డిజిపి భాస్కర్ తెలిపారు.  బంకులో ఎలాంటి ఫ్రాడింగ్ ఉండదని అయన అన్నారు. ఈ కార్యక్రామనికి అచ్చంపేట డిఎస్పీ నరసింహులు, సిఐ రామకృష్ణ, ఎస్ఐ ప్రదీప్ కుమార్, జైలర్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

 

డుంబ్రిగుడ చాపరాయి గడ్డ వద్ద వంతెన నిర్మాణం చేపట్టాలి

Tags:Prison branch petrol bunk start

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *