Natyam ad

ప్రభుత్వ ట్రజరీలకు ప్రైవేట్‌ ఆడిట్‌ గండి- కోట్లు స్వాహా

-తూతూ మంత్రంగా విచారణలు
– ముగ్గరిపై సస్పెన్షన్‌వేటు
– ఏసిబి చర్యలు తీసుకోవాలి

 

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

రాష్ట్ర ప్రభుత్వ ఖజానశాఖ కార్యాలయాలలో ప్రైవేటు ఆడిటర్ల హావ్వ తీవ్రంకావడంతో కోట్లాది రూపాయలు కొంత మంది ఖజనాశాఖ అధికారులు, అడిటర్లు సొంత ఖాతాల్లోకి ఉద్యోగుల టీడీఎస్‌ నిధులు జమ చేసుకున్న సంఘటన చిత్తూరు జిల్లా, అన్నమయ్యజిల్లా లో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. ప్రభుత్వ డ్రాయింగ్‌ ఆఫీసర్లకు ప్రతి సంవత్సరం సబ్‌ట్రజరీర్ల ద్వారా ఇన్‌కంట్యాక్స్కు టీడీఎస్‌ జమ చేయాల్సి ఉంది. ఉద్యోగులు తమ లెక్కలను జమ చేసి టీడీఎస్‌ రీఫండ్‌ను చేసుకోవడం ఆనవాయితీ. ఇలా ఉండగా ట్రజరీర్లలో లావాదేవీల ఆడిట్లను ప్రైవేటు ఆడిటర్లు ఏళ్ళ తరబడి నిర్వహిస్తుండటంతో అవినీతి అక్రమాలకు మార్గం సుగమమైంది. ఇలా ఉండగా తంబళ్లపల్లె ఎస్‌టీవో బాలమురళి, మదనపల్లె ఎస్‌టీవో శ్రీనివాసులు, పుంగనూరు ఎస్టీవో కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌ జీవనాధం, మదనపల్లెకు చెందిన ఆడిటర్‌ కలసి సుమారు రూ.25 కోట్లు స్వాహా చేసినట్లు ఆరోపణలు రావడంతో ట్రజరీ అధికారులు విచారణ చేసి ఎస్‌టీవోలు ఇద్దరిని , సీనియర్‌ అసిస్టెంట్‌ను సస్పెండ్‌ చేసి విచారణలు ఆదేశించారు.

స్వాహాలో బాధ్యులు ఎవరు..?
ఆడిటర్లపై చర్యలు శూన్యం…

ప్రభుత్వ ఖజానాకు సంబంధించి తప్పుడు లెక్కలు సృష్టించి , ప్రభుత్వాదాయానికి గండికొట్టి, అధికారులతో కలసి కోట్లాది రూపాయలు స్వాహా విషయం సుమారు పది సంవత్సరాలుగా చాపక్రింద నీరులా సాగుతోంది. ఇంతటి కుంభకోణంలో ఎవరెవరు బాధ్యులన్న విషయం తేల్చాల్సి ఉంది. అలాగే ఆడిటర్లపై చర్యలు తీసుకోకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. కానీ ప్రభుత్వ లావాదేవీలను ప్రైవేటు ఆడిటర్లు ఆడిట్‌ చేయడం, సర్టిఫికెట్లు జారీ చేయడం విడ్డూరం. దీని కారణంగా అక్రమాలకు కొంత మంది ఆడిటర్లు దోహాదం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి తక్షణం చర్యలు తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఖజానా కార్యాలయాలపై సీఐడి, ఏసిబితో విచారణ జరిపితే ఇలాంటి అక్రమాలు మరిన్ని వెలుగుచూసే అవకాశం ఉంది.

 

Tags: Private audit of government treasuries cost Rs

Post Midle