Natyam ad

బోల్తాపడిన ప్రైవేట్ బస్సు..

– పరిమితికి‌ మించి ప్రయాణికులతో ప్రయాణం
– ముందు వెళ్తున్న కారును తప్పించబోయి అదుపుతప్పిన బస్సు బోల్తా
– బస్సులో డ్రైవర్, కండక్టర్, ఇద్దరు క్లీనర్లతో‌ సహా 70మంది ప్రయాణం
– 67మందికి రక్తగాయాలు, 10మంది పరిస్థితి విషమం
– ఎంపీ‌మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే నవాజ్‌బాష ఆరా

 

అన్నమయ్య జిల్లా ముచ్చట్లు:

Post Midle

మదనపల్లె: బెంగళూరు వయా కేజీఎఫ్ నుంచీ మదనపల్లె వైపు వస్తున్న భారతి ప్రైవేట్ బస్సు మదనపల్లె మండలం వేంపల్లి పంచాయతీ బార్లపల్లి సమీపంలోని మర్రిమానుకుంట మలుపు వద్ద అదుపుతప్పి బో్ల్తా పడింది. కర్ణాటకకు చెందిన ఓ కారు ముందు వెళ్తున్న బస్సను ఓవర్‌టేక్ చేసి.. ముందుకు వెళ్ళింది. మార్గమధ్యలో.. కారు ఓ పల్లికు వెళ్ళడానికి మరలా వెనుకకు (యూటర్న్) చేస్తున్న సమయంలో వెనుక నుంచీ వస్తున్న బస్సు.. ఆ కారును తప్పించబోయి.. అదుపుతప్పి కుడివైపున వంకలోకి దూసుకెళ్ళి బోల్తానపడింది.బస్సులో డ్రైవర్, కండక్టర్‌తో సహా నిర్ణేత ప్యాసింజర్లు 52మంది‌ కాగా 66మంది ప్యాసింజర్లు, డ్రైవర్, కండక్టర్, ఇద్దరు క్లీనర్లు‌ కలుపుకుని 70మందితో ఫుట్‌బోర్డు ప్రయాణం చేయడం ద్వారానే ఈ ప్రమాదానికి దారి తీసిందని ఆర్టీఓ, పోలీస్ అధికారులు నిర్ధారించారు.గురువారం ఉదయం 10.40గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో డ్రైవర్ కండక్టర్ క్లీనర్లతో సహా 67మంది ప్రయాణికులకు అధిక రక్తగాయాలు కాగా, గాయపడిన క్షతగాత్రులను తరలించేందుకు 108లు సమయానికి అందుబాటులో లేకపోవడంతో రూరల్ సీఐ సత్యనారాయణ ఆటోలలో వీరిని మదనపల్లె జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

 

 

 

మదనపలప్రవేటాల్మీకిపురం, పీలేరు, తిరుపతి, కదిరి, చింతామణి, రాయల్పాడు, వాయల్పాడు ప్రాంతాలకు చెందిన వారిలో 10మందికి పరిస్థితి విషమించడంతో తిరుపతి, బెంగుళూరు ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులకు రెఫర్ చేశారు.క్షతగాత్రులను మదనపల్లె ఆసుపత్రికి ఆటోలలో తరలించగా.. ప్రభుత్వాసుపత్రి ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ పాల్‌రవికుమార్, ఆర్‌ఎంఓ, పీజీ వైద్యులు, సిబ్బంది, ఆవరణంలో ఉంటున్న ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లు, నిర్వాహకులు చికిత్సలకు పూర్తి సహకారం అందించడంతో చాలా వరకు ప్రాణాప్రాయం తప్పిందనే చెప్పవచ్చు. వీరి సేవలను పలువురు కొనియాడారు.బస్సు ప్రమాదం తెలిసిన వెంటనే ముందుగా టీడీపీ‌ ఇన్‌చార్జ్ మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ మదనపల్లె జిల్లా ప్రభుత్వ వైద్యశాలను సందర్శించి క్షతగాత్రులను పరామర్శించి.. వైద్యులతో సత్వర సేవలపై చర్చించారు. క్షతగాత్రులకు ఉచితంగా తాగునీటి వాటర్ బాటిల్స్‌ను పంపిణీ చేశారు. అదేవిధంగా జనసేన రాష్ట్ర నేత గంగారపు రామదాస్‌చౌదరి, మాజీ ఎమ్మెల్యే షాజహాన్‌బాష క్షతగాత్రులను పరామర్శించారు.

 

 

 

 

ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే నవాజ్‌బాష‌ ఘటనపై ఏపీ ఎండీసీ ఛైర్మన్ షమీంఅస్లాం, స్థానిక‌ మున్సిపల్ ఛైర్మన్ మనూజరెడ్డి, వైస్‌ఛైర్మన్ జింకాచలపతి, కౌన్సిలర్లు, మేదర కార్పొరేషన్ డైరెక్టర్ తాలే సుజాత సుబ్రమణ్యం (సుబ్బు), వైసీపీ నేత రమేష్‌లతో ప్రమాద ఘటనపై ఆరా తీశారు. అనంతరం ప్రభుత్వాసుపత్రి ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్‌ పాల్‌రవికుమార్‌తో ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడి అవసరమైన వైద్యసేవలు సత్వరం అందించి.. అవసరమైన వారికి కార్పొరేట్‌ ఆసుపత్రులకు తరలించి చికిత్సలు‌ అందించాలని సూచించారు.

 

Tags: Private bus overturned

Post Midle