నష్టాలు చూపించి ప్రైవేటీకరణ

విశాఖపట్నం ముచ్చట్లు:


విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం ఇప్పుడు మరో ఎత్తు గడ వేసిందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. ఉత్పత్తి తగ్గించి, నష్టాలు చూపి స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయాలనే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లను కొమ్ము కాస్తోందని విమర్శించారు. టీడీపీ మినీ మహానాడులో, వైసీపీ ప్లీనరీలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరణకు వ్యతిరేకంగా ఎందుకు తీర్మానాలు చెయ్యలేదని ప్రశ్నించారు.ఎంపీ గోరంట్ల మాధవ్ రాసలీలల వ్యవహరంలో వైసీపీ ప్రభు త్వం ఉదాసీనంగా ఉందని రాఘవులు విమర్శించారు. ఎస్పీ మీడియా సమా వేశం దీనిని నిరుగార్చేలా ఉందన్నారు. గోరంట్ల విషయంలో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.ఫోరెన్సిక్ లాబ్కు రిపోర్ట్ లేకుండా,అది ఫేక్ అని ఎలా చెబుతారని ప్రశ్నించారు. దేశమంతా ఒకటే పన్ను, ఒకటే ఎన్నిక, ఒకటే మాట, అనే నియంతృత్వ ధోరణిలో వెళ్తోందని, అది దేశానికి ప్రమాదమని అన్నారు. ఉచితాలు సంక్షేమంపై చర్చ జరిగేలా కేంద్రమే చేస్తోందని ఆరోపిం చారు.చైనా దూకుడు,దేశ రక్షణ విషయంలో ప్రధాని మాటలపై తమకు నమ్మకం ఉందన్నారు. ఆజాద్ కా అమృత్ ఉత్సవ్ బదులు ఆజాద్ కా సంకల్ప ఉత్సవ్ నిర్వహించాలన్నారు. జగన్ సర్కార్ విపరీతమైన అప్పులు చేస్తోందని బీవీ రాఘవులు అన్నారు.

 

Tags: Privatization shows losses

Leave A Reply

Your email address will not be published.