రామానాయుడుపై ప్రివిలేజ్ మోషన్

Date:03/12/2020

విజయవాడ ముచ్చట్లు:

నాలుగో రోజు పింఛన్ల వ్యవహారం హీట్ పెంచింది. అధికార-ప్రతిపక్షాల మధ్య వార్ నడిచింది. టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు రాష్ట్రంలో పింఛన్ల విషయాన్ని ప్రస్తావించారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.3000 పెన్షన్ ఇస్తామన్నారు.. అసలేమైంది అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఎంత పెన్షన్‌ ఎంత అన్నది రాష్ట్రంలో ఎవ్వరిని అడిగినా చెబుతారని సీఎం జగన్ కౌంటర్ ఇచ్చారు. ప్రతి ఒక్కరి నోటిలో నుంచి వచ్చేది రూ.1000 అని గుర్తుచేశారు. తమ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం రూ.2250 పెన్షన్‌ అందిస్తున్నామన్నారు. చంద్రబాబు నాయుడు తన హయాంలో నాలుగు సంవత్సరాల 10 నెలల పాటు కేవలం రూ.1000 మాత్రమే పెన్షన్‌ ఇస్తూ, ఎన్నికలకు రెండు నెలల ముందు మాత్రం పెన్షన్‌ రూ.2 వేలు చేశారన్నారు.ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు రాష్ట్రంలో 44 లక్షలు మాత్రమే ఇచ్చారని.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 61.94 లక్షల పింఛన్లు ఇస్తున్నామని తెలిపారు. చంద్రబాబు హయాంలో పెన్షన్‌ బిల్లు రూ.500 కోట్లు కూడా లేదని, ప్రస్తుతం తమ ప్రభుత్వంలో నెలకు 1500 కోట్ల రూపాయలు పెన్షన్ల రూపంలో ఇస్తున్నామన్నారు. టీడీపీ నేతలు ఓ పద్ధతి ప్రకారం అబద్ధాలు చెబుతూ.. మోసాలు చేస్తున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఎన్నికలకు ముందు ఏం చెప్పామన్నది మేనిఫెస్టోలో రాశామని, ఆ మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావిస్తామన్నారు సీఎం.సభలో అసత్యాలు ప్రచారం చేస్తున్న టీడీపీ సభ్యుడు రామానాయుడుపై సీఎం జగన్‌ మండిపడ్డారు. రామానాయుడు కాదు.. డ్రామానాయుడని సెటైర్లు పేల్చారు. అన్నీ అబద్ధాలు చెబుతూ.. ఉద్దేశపూర్వకంగా సభను తప్పు దోవ పట్టిస్తున్నారని అన్నారు. ఆయనపై సభాహక్కుల ఉల్లంఘన తీర్మానం కోరుతుమన్నారు. ఆయన సభలో శాశ్వతంగా మాట్లాడుకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆ తర్వాత సభా నాయకుడి సూచన మేరకు టీడీపీ సభ్యుడు రామానాయుడిపై సభా హక్కుల ఉల్లంఘనకు సంబంధించి చర్యలు కొనసాగుతాయని స్పీకర్‌ తెలిపారు.

పుంగనూరు ఎంపీపీ అభ్యర్థి అక్కిసాని భాస్కర్‌రెడ్డి జన్మదిన వేడుకలు

Tags: Privilege motion on Ramanayudu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *