మరో సాంగ్ తో బేజారు చేసిన ప్రియ ప్రకాష్

Priya Prakash made a comeback with another song

Priya Prakash made a comeback with another song

Date:19/05/2018
చెన్నై ముచ్చట్లు:
కన్నుగీటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ప్రియా ప్రకాష్ వారియర్ మరో సాంగ్ టీజర్‌తో కుర్రకారును బేజారు చేస్తోంది. మలయాళంలో తెరకెక్కుతున్న ‘ఒరు అదార్ లవ్’ సినిమా తమిళంలో కూడా విడుదల కానుంది. ఈ సందర్భంగా తమిళ వెర్షన్‌కు సంబంధించిన సరికొత్త సాంగ్ టీజర్‌ను ప్రియా తన ఇన్‌స్టాగ్రమ్ అకౌంట్లో పోస్ట్ చేసింది. యూట్యూబ్‌లో ఈ వీడియోను రెండు రోజుల వ్యవధిలో 14 లక్షల మంది వీక్షించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన సాంగ్ టీజర్, సీన్ టీజర్లు సోషల్ మీడియాలో సెన్సేషనల్‌గా నిలిచాయి. తాజాగా విడుదలైన ‘మున్నాలే పొన్నాలే’ తమిళ సాంగ్ టీజర్‌ కూడా అదేవిధంగా దూసుకెళ్తుందని నిర్మాతలు ఆశిస్తున్నారు. ఈ టీజర్‌లో ప్రియా ప్రకాష్, రోషన్‌లు మరోసారి క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో మది దోచుకుంటున్నారు. ఆమెను ఫాలో అవుతూ రోషన్ పుస్తకాన్ని ఎగరేసి పట్టుకునే సీన్ కుర్రకారుకు నచ్చుతుంది. ఈ సినిమాను తెలుగు, హిందీ భాషల్లో కూడా అనువాదించి విడుదల చేయాలని భావిస్తున్నట్లు నిర్మాతలు తెలుపుతున్నారు. తాజాగా తమిళ టీజర్ విడుదల కావడంతో తెలుగు టీజర్ కూడా త్వరలోనే విడుదలయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా సెప్టెంబరులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
TAgs:Priya Prakash made a comeback with another song

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *