ప్రియాంక గాంధీ పేరుతో ట్విట్టర్

Priyanka Gandhi's Twitter
 Date:12/02/2019
న్యూఢిల్లీ ముచ్చట్లు:
కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు చేపట్టిన పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి ప్రియాంక గాంధీ ఐఎన్‌సీ అనే పేరు మీద ట్విట్టర్ ఖాతా ఉన్నట్లు పోస్టులు చేశారు. ఆ ట్విట్టర్ ఖాతా నుంచి పోస్ట్ అయిన ట్వీట్ వివాదాస్పదమైంది. ‘ప్రజలకు అవసరమైన స్వచ్ఛమైన తాగునీటి కంటే ప్రభుత్వానికి కుంభమేళాలో చేసే పుణ్య స్నానాలు ముఖ్యం. మూర్ఖులు ఎక్కువగా ఉన్న దేశంలో ప్రభుత్వం పుణ్య స్నానాలకే ప్రాధాన్యం ఇస్తుందని’ ప్రియాంక గాంధీ ఐఎన్‌సీ ఖాతా నుంచి ట్వీట్ చేశారు. ప్రియాంక ట్వీట్‌పై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. శ్రీనివాస్ పోతరాజు అనే ఫేస్‌బుక్‌ యూజర్.. ఈ విషయాన్ని పోస్ట్ చేస్తూ ప్రశ్నించాడు. కాంగ్రెస్‌లో యువతరం హవా నడుస్తోంది. గాంధీజీ కలలు సాకారం అయ్యేలా కనిపిస్తుంది. ఆ అన్న, చెల్లెలును లేకుండా చేస్తే ఏదైనా సాధ్యమవుతుందని అర్థం వచ్చేలా శ్రీనివాస్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. సోమవారం  ఉదయం వరకు ప్రియాంక గాంధీకి ట్విట్టర్ ఖాతా లేదు. ప్రియాంక ట్విట్టర్‌లో చేరారని కాంగ్రెస్ పార్టీ చేసిన ట్వీట్ చూస్తే విషయం అర్థమవుతుంది. తన ట్విట్టర్ ఖాతా నుంచి ప్రియాంక అప్పటివరకూ ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. సచిన్ పైలట్, అశోక్ గెహ్లాట్, కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ అకౌంట్, అహ్మద్ పటేల్, రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా, జ్యోతిరాదిత్య సిందియా, రాహుల్ గాంధీలను ట్విట్టర్‌లో ప్రియాంక గాంధీ ఫాలో అవుతున్నారు. అదే సమయంలో ప్రియాంకకు ట్విట్టర్‌లో 18,100 మంది ఫాలోయర్లు ఉన్నారు. ప్రియాంక గాంధీ ఎలాంటి వివాదాస్పద ట్వీట్లు చేయలేదని, ఆమెకు ఆ సమయంలో ట్విట్టర్ అధికారిక ఖాతా కూడా లేదని టైమ్స్ ఫ్యాక్ట్ చెక్ విభాగం గుర్తించింది. ప్రియాంక గాంధీ ఐఎన్‌సీ పేరుతో వివాదాస్పద ట్వీట్ చేసిన ఖాతాను తొలగించారు. ప్రియాంక గాంధీ అని టైప్ చేస్తే ట్విట్టర్‌లో మరిన్ని ఖాతాలను గమనించవచ్చు. ఆమె పేరు మీదుగా నకిలీ ఖాతాలు క్రియేట్ చేసి కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు.
Tags:Priyanka Gandhi’s Twitter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *