యూపీలో ప్రియాంక షో

Priyanka Show in UP
Date:11/02/2019
లక్నో ముచ్చట్లు:
కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు చేపట్టిన ప్రియాంక గాంధీ దూకుడు పెంచారు. పార్టీ ఉత్తరప్రదేశ్‌ తూర్పు విభాగానికి ప్రధాన కార్యదర్శి హోదాలో ప్రియాంక లక్నోలో పర్యటించారు. సోమవారం నగరంలో సోదరుడు, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో కలిసి రోడ్‌ షోలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రచార రథంపై ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ప్రియాంకకు కాంగ్రెస్ శ్రేణుల నుంచి ఘన స్వాగత లభించింది. నగరంలోని అమౌసి ఎయిర్‌పోర్టు నుంచి కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం వరకు కొనసాగింది. మరోవైపు ప్రియాంక ట్విట్టర్‌‌‌లోకి అడుగు పెట్టారు. కొద్దిసేపటికే వెరిఫైడ్ అకౌంట్‌గా ట్విట్టర్ కూడా ప్రకటించింది. అకౌంట్ యాక్టివ్ అయిన గంటల్లోపే 50వేలమందికిపైగా ఫాలోవర్లు వచ్చేశారు. ఇప్పటి వరకూ ఆమె ఎలాంటి ట్వీట్ చేయలేదు. ప్రియాంక ట్విట్టర్ అకౌంట్ ప్రారంభించినట్లు కాంగ్రెస్ కూడా ప్రకటించింది.
సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతుండటంతో కాంగ్రెస్ వ్యూహాలను సిద్ధం చేసుకుంటోంది. లోక్‌సభ ఎన్నికల్లో కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో.. ప్రియాంకకు పార్టీ బాధ్యతల్ని అప్పగించారు. ఆమెకు బీజేపీకి కంచుకోటగా ఉన్న 40 లోక్‌సభ స్థానాల బాధ్యతల్ని అప్పగించారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఎంపీగా పనిచేసిన గోరఖ్‌పూర్‌ సీట్లు ఉన్నాయి.

దుర్గమాతాగా ప్రియాంక
 ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్‌ పార్టీ ఉత్తరప్రదేశ్‌ ఈస్ట్‌ ఇంచార్జిగా బాధ్యతలు చేపట్టిన ప్రియాంక గాంధీ.. తొలిసారిగా లక్నోలో ఇవాళ అడుగుపెట్టబోతున్నారు. ఈ సందర్భంగా ప్రియాంక ఫోటోలతో లక్నో నగరం ముస్తాబైంది. దుర్గామాత రూపంలో ప్రియాంకను చూపుతున్న పోస్టర్‌ పలువురిని ఆకర్షిస్తోంది. యూత్‌ కాంగ్రెస్‌ లీడర్‌ ఈ పోస్టర్లను ఏర్పాటు చేసి పలువురి దృష్టిని ఆకర్షించాడు. నాలుగు రోజుల పాటు యూపీలో ప్రియాంక పర్యటించనున్నారు. 30 కిలోమీటర్ల మేర మెగా రోడ్‌షో నిర్వహించనున్నారు ప్రియాంక. రోడ్‌షోలో భాగంగా పలు చోట్ల ఆమె ఉపన్యాసం ఇవ్వనున్నారు. ఈ రోడ్‌షోలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో పాటు యూపీ వెస్ట్‌ ఇంఛార్జి జ్యోతిరాధిత్య సింధియా పాల్గొననున్నారు. త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, వివిధ రాష్ర్టాల ఇన్‌ఛార్జిల సమావేశానికి ప్రియాంక గాంధీ హాజరై చర్చించిన సంగతి తెలిసిందే.
Tags:Priyanka Show in UP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *