సౌత్ నుంచే ప్రియాంక అడుగులు

బెంగళూర్  ముచ్చట్లు:


కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం కోసం కసరత్తులు ప్రారంభించింది. పార్టీ పునరుజ్జీవనంక కోసం సంస్థాగతంలో చర్యలు తీసుకోవడం మొదలు పెట్టింది.  అందులో భాగంగానే   దక్షిణాది రాష్ట్రాల బాధ్యతలను పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి అప్పగించింది.తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల పూర్తిస్థాయి ఇన్‌ఛార్జీ బాధ్యతలను ప్రియాంక గాంధీకి అప్పగించింది.   కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సిడబ్లుసి) సమావేశం తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది.  ఆ రాష్ట్రాలలో  పార్టీలో విభేదాలు, అంతర్గత కుమ్ములాటలున్న నేపథ్యంలో ప్రియాంక గాంధీకి బాధ్యతలు అప్పగించారు.ప్రాంతీయ నాయకుల మధ్య సఖ్యతను సాధించడమే లక్ష్యంగా ప్రియాంక పని చేయనున్నారు. తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లో వచ్చే ఏడాది ఏప్రిల్-మే నెలల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణ లో కూడా ముందస్తు ఎన్నికల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సెప్టెంబర్ 7 నుంచి ‘భారత్ జోడో యాత్ర’ చేపట్టనుంది.  కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జరిగే ఈ యాత్రలో కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు ఈ యాత్రలో పాల్గొననున్నారు.

 

Tags: Priyanka steps from the south

Leave A Reply

Your email address will not be published.