కమాన్ పూర్ ముచ్చట్లు:
అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట సందర్భంగా జి.వి.ఆర్ సేన అధ్వర్యంలో ఈనెల 21నాడు కల్వచర్ల గ్రామంలో నిర్వహించిన ముగ్గుల పోటీలో అనేక మంది మహిళామణులు పాల్గొన్నారు.అయోధ్య రామ మందిర కథనాన్ని తీసుకొని ముగ్గు వేసిన మహిళామణులు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన గ్రామ సర్పంచ్ గంట పద్మ వెంకటరమణ రెడ్డి మాట్లాడుతూ 500 సంవత్సరాల తర్వాత రామ మందిర ప్రాణ ప్రతిష్ట చేయడం శుభ పరిణామం అని ,అలాగే రాముని యొక్క జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయం అని, కుటుంబం యొక్క విలువలు సమాజంలో మనిషి మనిషిని గౌరవించే తత్వం, మానవసేవే మాధవసేవ దిశగా మనం ఆ రాముడు చూపిన మార్గంలో ప్రయాణించాలని కోరుకోవడం జరిగింది.
అలాగే కలవచర్ల గ్రామంలో మహిళల్లో ఉన్న ప్రతిభను బయటకు తీసుకురావడానికి ముగ్గుల పోటీల్లో నిర్వహించడం చాలా సంతోషమని , అందరూ రాముని ఇతివృత్తాన్ని ముగ్గుల గా వేయడం చాలా ఆనందాన్ని కలిగించింది. ఈ పోటీల్లో గ్రామానికి చెందిన *ముస్లిం యువతి ఎండి అస్మా వేసిన ముగ్గు చాలా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది * అస్మా గారు పాల్గొనడం మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిందని ప్రత్యేకంగా అభినందించారు. ఈ యొక్క పోటీలను ఆర్గనైజ్ చేసిన డాక్టర్ శరణ్య మారుతి లను ప్రత్యేకంగా అభినందించడం జరిగింది అనంతరం విజేతలకు బహుమతులు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కొట్టే సందీప్,ఉప సర్పంచ్ వేము కనకయ్య,మాజీ ఉప సర్పంచ్ ముచ్చకుర్తి శ్రీనివాస్,కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు కోలిపాక సారయ్య, జి.వి.ఆర్ సేన సభ్యులు మేకల మారుతి,మామిడి హరీష్,అంజి, కొయ్యడ స్వామి తదితరులు పాల్గొన్నారు.
Tags: Prize ceremony for winners of triathlon competitions