విజేతలకు బహుమతులు ప్రధానం
కడప ముచ్చట్లు:
కడప నగర పరిధిలోని రామరా జుపల్లె సంక్రాంతి ఆటల పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు ఇందులో ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కే.సి.బాదుల్లా పాల్గొన్నారు దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు కే మునయ్య, ఇన్సాఫ్ నాయకులు మైనుద్దీన్, రామరాజు పల్లి యూత్ గూడూరు చిన్నయ్య (సుబ్బరాయుడు ) నాగార్జున పైడి కాలువ బాబు వసంతయ్య రాఘవ, సురేష్, హేమంత్ కుమార్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు . ఈ సందర్భంగా కేసి బాదుల్లా మాట్లాడుతూ మనదేశంలో అన్ని పండుగల కంటే సంక్రాంతి పండుగ చాలా ప్రాముఖ్యత కలిగిందని చెప్పారు ఈపండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం మహిళలకు పిల్లలకు యువకులకు పోటీలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకోవడం రామరాజు పల్లి యువతను అభినందించవలసిన విషయం అన్నారు. మన దేశ సంప్రదాయక ఆటలను మనం సాంప్రదాయ ఆటలను గౌరవించుకోవాలన్నారు. అలాగే గ్రామ యువత ఎప్పటికప్పుడు విద్యార్థులకు పిల్లలకు అశ్లీలసాహిత్యానికి సెల్ఫోన్ అనవసరవాడకం నుంచి తగ్గించి క్రమశిక్షణ జీవితం ఉండేటట్లు కృషి చేయాలన్నారు.

అలాగే సమాజంలో జరిగే అవినీతికి లంచగొండితనాలకు యువత చైతన్యవంతమై వాటిని వ్యతిరేకించి అరికట్టాలన్నారు . ప్రస్తుత పాలకులు అవలంబించే ప్రజా వ్యతిరేక విధానాలపై మంచి చెడు విషయాలపై అవగాహన పెంచుకోవాలన్నారు రాజకీయాలపై అవగాహన. ఆసక్తి ఉన్నప్పుడే మంచి సమాజం నిర్మించడం సాధ్యమవుతుందన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువత ఓటు హక్కు ద్వారా మన పాలకులను ఎన్నుకొనే అవకాశం ఉన్నందున ఈ అవకాశం ద్వారా మంచి పాలకులను నాయకులను ఎన్నుకోవాలి అన్నారు. ఇప్పుడు వ్యాపారస్తులు అవినీతిపరులు నిరక్షరాస్యులు రౌడీలు రాజకీయాలలో చేరి మనం వేసే ఓటు హక్కు ద్వారా పాలకులయ్యారన్నారు. మనం ఎన్నుకునే నాయకులను రాజకీయ అవగాహనతో ఎన్నుకోవాలన్నారు కావున నేటి యువత రాజకీయాలపై ఆసక్తితో ఉండాలన్నారు . గ్రామాలలో పట్టణాలలో అన్ని మతాలు ఒకటే అంటూ మంచి సాంప్రదాయం కొనసాగించాలన్నారు పోటీలో పాల్గొన్న మహిళలు, పిల్లలకు బహుమతులు ప్రధానం చేశారు.
Tags; Prizes for winners are important
