ప్రొబేషన్ డిక్లరేషన్, మహిళా పోలీసుల హర్షాతిరేకాలు
కడప ముచ్చట్లు:
రాష్ట్ర ప్రభుత్వం తమ ఉద్యోగాల ప్రొబేషన్ డిక్లరేషన్ చేస్తున్న నేపథ్యంలో మహిళా పోలీసులు హర్షం వ్యక్తం చేశారు. సోమవారం జిల్లాలోని మహిళా పోలీసులు జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ మర్యాదపూర్వకంగా కలిసి మిఠాయిలు అందచేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ మాట్లాడుతూ ప్రొబేషన్ డిక్లరేషన్ తో మరింత సమర్ధవంతంగా విధులు నిర్వర్తించాలని ఆకాంక్షించారు. మహిళలపై నేరాలు జరగకుండా చూడటం, ఒకవేళ జరిగినట్లు తెలిసినా వెంటనే సంబంధిత పోలీసు అధికారులకు తెలియచేయచేయాలన్నారు. చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు మీ పరిధిలో జరిగితే స్థానిక పోలీసు అధికారులకు సమాచారం అందించాలన్నారు. బాల్యవివాహాలు అరికట్టేందుకు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాలని జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ సూచించారు. కార్యక్రమంలో జిల్లాలోని వివిధ గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులు పాల్గొన్నారు.
Tags:Probation Declaration, Women Police Cheers