సమస్యలు లేని పుంగనూరు ఏర్పాటు – కొండవీటి నాగభూషణం
పుంగనూరు ముచ్చట్లు:
రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గమైన పుంగనూరును సమస్యలు లేని పట్టణంగా మార్చుతామని రాష్ట్రజానపద కళల స్రంస్థ చైర్మన్ కొండవీటి నాగభూషణం తెలిపారు. సోమవారం గడప గడపకు కార్యక్రమాన్ని మదనపల్లె రోడ్డు, కొత్తయిండ్లు ప్రాంతాలలో కమిషనర్ నరసింహప్రసాద్‌రెడ్డి , మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా, మంత్రి పెద్దిరెడ్డి పీఏ చంద్రహాస్‌తోకలసి నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి జగనన్న సంక్షేమ బావుట పుస్తకాలను పంపిణీ చేసి, సంక్షేమ పథకాలు గూర్చి వివరించారు. నాగభూషణం మాట్లాడుతూ సచివాలయాల ఏర్పాటుతో సమస్యలు ఎప్పటికప్పుడు గుర్తించి ప్రజల ఇంటి వద్దనే పరిష్కరించడం జరుగుతోందన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అర్హులైన పేదలందరికి పథకాలు అందించడం జరుగుతోందన్నారు. మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గ కేంద్రంలో అన్ని ప్రాంతాలకు రోడ్లు, కాలువలు, పైపులైన్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే పట్టణంలో రూ.3 కోట్లతో బైపాస్ రోడ్డు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గత ప్రభుత్వాలు పుంగనూరు అభివృద్ధిని అడ్డుకున్నారని తెలిపారు. ప్రస్తుతం ఏ సమస్య లేకుండ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్లు నాగేంద్ర, సిఆర్.లలిత, కౌన్సిలర్లు రామకృష్ణంరాజు, అమ్ము, నరసింహులు, , జేపి.యాదవ్, రేష్మా, సాజిదా, భారతి, కాళిదాసు, ఆదిలక్ష్మీ, జయభారతి, కమలమ్మ తో పాటు సోషియల్ మీడియా కోఆర్డినేటర్ నవీన్‌కుమార్‌రాజు, సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు పాల్గొన్నారు.

Tags: Problem-free Punganur formation – Kondaveeti Nagabhushan
