సమస్యలు పరిష్కరించేందుకే పల్లెబాట

Problem solving problems
– మంత్రి పెద్దిరెడ్డి
Date:03/08/2019
పుంగనూరు ముచ్చట్లు:
గ్రామీణ ప్రాంతాలలోని సమస్యలను గుర్తించి, ప్రజలతో నేరుగా చర్చించి, పరిష్కరించేందుకే పల్లెబాట కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ , గ్రామీణాభివృద్ధి గనులశాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. శనివారం మండలంలో రెండవ రోజు పల్లెబాట కార్యక్రమాన్ని చదళ్ల, గుడిసెబండ, కుమ్మరనత్తం, ఏతూరు, బండ్లపల్లె, నెక్కుంది గ్రామ పంచాయతీలలో చిత్తూరు ఎంపి రెడ్డెప్ప, తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి , తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు పెద్దిరెడ్డి, కొండవీటి నాగభూషణం, నాగరాజారెడ్డి, దామోదర్‌రాజు, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అక్కిసాని భాస్కర్‌రెడ్డి, జెడ్పిమాజీ ప్లోర్‌లీడర్ వెంకటరెడ్డి యాదవ్ తో కలసి నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రికి మహిళలు నీరాజనాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి ప్రజల వినతిపత్రాలను స్వీకరించి, సమస్యలు పరిష్కరిస్తామని హామి ఇచ్చారు. సమయం లేనందున పల్లెబాటను పంచాయతీల్లో నిర్వహించడం జరుగుతోందని త్వరలోనే ప్రతి గ్రామానికి వచ్చి ప్రజలను నేరుగా కలుస్తానని మంత్రి తెలిపారు. గ్రామాల్లో మంచినీటి సమస్యను పరిష్కరిస్తామన్నారు. అలాగే ఏతూరు ప్రాంతంలో ఆర్వోఆర్ ప్లాంటును ఏర్పాటు చేసి, ఈ ప్రాంత ప్రజలకు రక్షిత మంచినీటిని సరఫరా చేస్తామన్నారు. అలాగే రోడ్లు, కాలువలు, వీధులు ఏర్పాటు పూర్తి చేస్తామన్నారు. ప్రజలకు అవసరమైన పెన్షన్లు, రుణాలు మంజూరు చేయించి, ప్రతి ఒక్కరికి పక్కాఇల్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల కార్యక్రమంలోని అన్ని పథకాలను ప్రజలకు అందిస్తామన్నారు. అమ్మ ఒడి పథకం క్రింద పాఠశాలలకు పిల్లలను పంపే ప్రతి తల్లికి రూ.15 వేలు ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు. పేద ప్రజల అభివృద్ధే వైఎస్సార్సీపి లక్ష్యమని స్పష్టం చేశారు. మహిళల డ్వాక్రా రుణాలన్ని నాలుగు సంవత్సరాలలో పూర్తిగా రుణమాపి అవుతుందన్నారు. ఇందుకు సంబంధించిన వడ్డీని సైతం ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. . ఈ సమావేశంలో పార్టీ స్థానిక నేతలు మాజీ ఎంపీపీ నరసింహులు, మండల పార్టీ అధ్యక్షుడు విజయభాస్కర్‌రెడ్డి, యువజన సంఘనాయకుడు చెంగారెడ్డి, దేశిదొడ్డి ప్రభాకర్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి, అమరనాథరెడ్డి, రామకృష్ణారెడ్డి, జి.చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మంత్రి పెద్దిరెడ్డికి వెలుగు ఉద్యోగులచే సన్మానం ….
రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఏపి వెలుగు సెర్ఫ్ హెచ్ఆర్ఎంప్లాయిస్ రాష్ట్ర నాయకులు పేట హరికృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సన్మానించారు. నెక్కుంది గ్రామంలో పర్యటిస్తున్న మంత్రిని వెలుగు మహిళా సంఘాల నేతలు కలసి సన్మానించారు. అలాగే సెర్ఫ్ ఉద్యోగులకు స్థిరత్వాన్ని కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గంగోజి, శారద, నాగరత్న, కృష్ణప్ప, వసంత, చిన్నప్ప, శీనప్ప, నాగమణి, ఉమామహేశ్వరి, సుబ్బన్న, సుజాత , శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
Tags: Problem solving problems