పంచాయతీల్లో సమస్యలను నిర్లక్ష్యం చేయరాదు

Problems in panchayats should not be ignored

Problems in panchayats should not be ignored

– ఎంపీడీవో లక్ష్మిపతినాయుడు

Date:22/07/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మండలంలోని అన్ని పంచాయతీలలోను ప్రజా సమస్యల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యము చేయకుండ ప్రభుత్వ పథకాలను పటిష్టంగా అమలు చేయాలని ఎంపీడీవో లక్ష్మిపతినాయుడు పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. సోమవారం ఆయన మండల కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో వలంటీర్ల నియామకాలు పూర్తి కావస్తోందని ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిష్కరించేలా కార్యదర్శులు చర్యలు తీసుకోవాలన్నారు. ఎలాంటి అవినీతి అక్రమాలు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం నిర్ధేశించిన మేరకు సమస్యలను పరిష్కరించి తీరాలని ఆదేశించారు. ఈ సమావేశంలో కార్యదర్శులు సుధాకర్‌ , శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మెప్మా బజారులో ప్రజలకు అవసరమైన వస్తువులు విక్రయం

Tags; Problems in panchayats should not be ignored

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *