అర్జీ దారుల సమస్యలను వెంటనే పరిష్కారించాలి

కడప ముచ్చట్లు:

ప్రజా సమస్యల పరిష్కారార్థం ఏర్పాటు చేసిన   “స్పందన”   కార్యక్రమం ద్వారా స్వీకరించిన  అర్జీదారుల సమస్యలను అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలను పరిష్కరించాలని  అన్ని శాఖల  అధికారులను  జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు  ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్లోని స్పందన హాల్లో   ప్రజా ఫిర్యాదుల స్వీకరణ “స్పందన”  కార్యక్రమం  జరిగింది.  ఈ  కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు   డిఆర్వో మాలోల,  డ్వామా పి.డి. యదుభూషన్ రెడ్డి,  స్పెషల్ కలెక్టర్ రామమోహన్, అనుడ విసి శ్రీలక్ష్మి..లు  హాజరై ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు మాట్లాడు తూ  ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు .. క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి, అర్జీదారుడు సంతృప్తిచెందేలా  నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా రూపొం దించిన స్పందన పోర్టల్ ద్వారా..

 

 

 

ప్రజా సమస్యలను మరింత సులభతరంగా, నాణ్యతతో పరిష్కరించడంతో పాటు.. పరిష్కార నివేదికను కూడా సంబందిత పోర్టల్లో పొందుప రచాలని అధికారులను ఆయన ఆదేశించారు.  పెండింగ్ బియాండ్ ఎస్ఎల్ఏ, రీఓపెనింగ్.. లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలను పరిష్కరించాలన్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ఆయా శాఖల అధికారులు తమకు ఇచ్చిన లక్ష్యాల మేరకు ఫలితాలను సాధించా లన్నారు.  ఈ కార్యక్ర మంలో కలెక్టరేట్ ఓ.ఎస్. డి. రఘునాథ్,  సమగ్ర శిక్ష పీడి   ప్రభాకర రెడ్డి, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా.నాగరాజు,   రిమ్స్ సూపర్ ఇన్ టెండెంట్ డా.ప్రసాద్, గృహనిర్మాణ శాఖ పీడి కృష్ణయ్య,  డి.సి.ఓ., సుభాషిణి, విద్యుత్ శాఖ ఎస్. ఈ. శోభ వలేంటీన, ఎస్ సి  కార్పొరేషన్ ఈడి వెంకట సుబ్బయ్య, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖాధికారి బ్రహ్మయ్య,  జడ్పి సీఈవో సుధాకర్ రెడ్డి, గ్రౌండ్ వాటర్ డి.డి. మురళీధర్, జిల్లా వ్యవసాయ శాఖాధికారి నాగేశ్వరరావు,సి పి ఓ, ఉద్యానశాఖ డిడి వజ్రశ్రీ,   అన్ని శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Problems of petitioners should be resolved immediately

Post Midle
Natyam ad