పుంగనూరులో సచివాలయాలతో సమస్యలు మాయం -మున్సిపల్ చైర్మన అలీమ్బాషా
పుంగనూరు ముచ్చట్లు:
ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచివాలయాల ద్వారా ప్రజల సమస్యలు ఎక్కడిక్కడ పరిష్కరించడం జరుగుతోందని మున్సిపల్ చైర్మన అలీమ్బాషా తెలిపారు. శనివారం ఆయన పట్టణంలోని 26, 27 వార్డులలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని కమిషనర్ నరసింహప్రసాద్రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి పీఏ చంద్రహాస్తో కలసి నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి జగనన్న సంక్షేమ బావుట బుక్లెట్లను పంపిణీ చేశారు. చైర్మన్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు గడప గడపకు కార్యక్రమాన్ని పటిష్టంగా నిర్వహిస్తున్నామన్నారు. వార్డుల వారీగా సచివాలయాలు ఏర్పాటు చేయడంతో వలంటీర్లు ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలు అందించి , సమస్యలు పరిష్కరిస్తున్నారని తెలిపారు. అర్హులైన పేదలందరికి పక్కాగృహాలు మంజూరు చే యడం జరిగిందన్నారు. 1536 మందికి టిట్కోగృహాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో రోడ్లు, కాలువలు, విద్యుత్ ఏర్పాటు చేసి, పైపులైన్ల ద్వారా మంచినీటి సరఫరా చేస్తున్నామన్నారు. అలాగే జగనన్న కాలనీలలో 1256 మందికి పట్టాలు పంపిణీ చేసి, గృహ నిర్మాణాలు వేగవంతం చేశామన్నారు. అలాగే 826 మంది ఇండ్ల స్థలాల కోసం ధరఖాస్తు చేసుకున్నారని, వారికి కూడ పట్టాల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సేవలు అందిస్తోందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి ఫకృద్ధిన్షరీఫ్, వైస్ చైర్మన్లు లలిత, నాగేంద్ర, కౌన్సిలర్లు భారతి, రాఘవేంద్ర, త్యాగరాజు, అమ్ము, అర్షద్అలి, కిజర్ఖాన్, నరసింహులు, రేష్మా, కాళిదాసు,సాజిదా తదితరులు పాల్గొన్నారు.

Tags; Problems with secretariats in Punganur resolved – Municipal Chairman Aleem Basha
