సేవా ధృక్పధంలో ముందుకు రండి

Date:01/05/2020

వరంగల్ రూరల్

కరోనా వైరస్ కట్టడి  కొరకు రాష్ట్రంలో లాక్ డౌన్  విధించిన నేపథ్యంలో ఎస్ ఆర్ ఫార్చ్యూన్ ఇన్ఫ్రా ఆధ్వర్యంలో 300 మందికి  నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.  ఈ కార్యక్రమానికి  మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హజరయ్యారు. వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం  మైలారం గ్రామానికి చెందిన ఎస్.ఆర్.ఆర్ ఫార్చ్యూన్ ఇన్ఫ్రా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో తన స్వగ్రామమైన మైలారం గ్రామంలోతన  వంతు సహాయంగా నిత్యావసర సరుకులు  మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేతులమీదుగా పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ  ప్రతీ ఒక్కరూ  సేవా దృక్పథంతో ముందుకు వచ్చి పేదలను ఆదుకోవాలని  విజ్ఞప్తి చేశారు. కరోణ కట్టడి కోసం ముందస్తు చర్యలో భాగంగా సీఎం కేసీఆర్  అనేక చర్యలు చేపట్టి కరోణ వైరస్ బారినపడకుండా నివారించడం జరిగిందని అన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దయనీయమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే3 వేల కోట్లను వెచ్చించి రైతులు పండించిన ప్రతి ధాన్యాన్ని  ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని అన్నారు. ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న డాక్టర్లు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తన స్వగ్రామంలో పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసి వారిని అదుకోవడం చాలా సంతోషంగా ఉందని ఎస్ ఆర్ ఆర్ ఇన్ఫ్రా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

కర్నాటకలో మాల్స్ కు అనుమతులు

Tags: Proceed on a service basis

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *