ప్రొ. హరగోపాల్ అరెస్టు.. గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత

Prof.. Haragopal arrested .. tension at gun park

Prof.. Haragopal arrested .. tension at gun park

 Date:14/09/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
సేవ్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో చేపట్టిన విద్యా విజ్ఞాన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. ఆందోళనలో పాల్గొన్న ప్రొఫెసర్ హరగోపాల్, విద్యావేత్త చుక్కా రామయ్యతో పాటు పలువురు విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ‘ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలను కాపాడుకుందాం’ అనే నినాదంతో తెలంగాణ విద్యా పోరాట, పరిరక్షణ కమిటీ 100 రోజుల విద్యా విజ్ఞాన పోరాట యాత్రను శుక్రవారం  ప్రారంభించింది. గన్ పార్క్ వద్ద ప్రారంభమైన ఈ యాత్రలో హరగోపాల్, చుక్కా రామయ్యలతో పాటు వివిధ ప్రజా సంఘాల నేతలు, మద్దతుదారులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా నిరసనకారులు గన్‌పార్క్ వద్ద ర్యాలీగా బయలుదేరారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అప్పటికే అక్కడ మోహరించిన పోలీసులు ప్రొఫెసర్ హరగోపాల్, చుక్కా రామయ్యను అదుపులోకి తీసుకున్నారు. కొంత మంది విద్యార్థులు వారిని అడ్డుకోడానికి ప్రయత్నించడంతో పోలీసులు, ఆందోళనకారుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో కొంత మంది మహిళా విద్యార్థులు కిందపడ్డారు. మరికొంత మంది విద్యార్థులు పోలీసు వాహనాలకు అడ్డుగా కూర్చొని నిరసన చేశారు.
దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రొఫెసర్ హరగోపాల్ పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని, కనీసం ఆయన వయసుకు కూడా గౌరవం ఇవ్వలేదని నిరసనకారులు ఆరోపించారు. ఆయనను బలవంతంగా ఈడ్చుకుంటూ వెళ్లి అవమానించారని చెప్పారు. హరగోపాల్‌ను అరెస్టు చేసిన అనంతరం పోలీసులు ఆయణ్ని గోషామహల్ పోలీస్ స్టేషన్‌కు అంతకుముందు.. ప్రొ. హరగోపాల్ ర్యాలీ ప్రారంభిస్తూ.. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తానంటూ అధికారంలోకి వచ్చిన కేసీఆర్ విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేశారని అన్నారు. ప్రభుత్వ విద్య పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఈ యాత్ర ద్వారా ప్రజలకు వివరిస్తామని చెప్పారు.
Tags:Prof.. Haragopal arrested .. tension at gun park

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *