ఎంప్లాయిమెంట్ ఆఫీసుల్లో కాని  ప్రొఫెషనల్ డిగ్రీ రిజిస్ట్రేషన్లు

Professional degree registrations in the employment offices

Professional degree registrations in the employment offices

Date:21/05/2018
అమరావతి ముచ్చట్లు:
కృష్ణా, గుంటూరు జిల్లాలో కేవలం 10వ తరగతి, ఇంటర్, డిప్లోమో, ఐటిఐ, ఎఎన్‌ఎం, జీఎన్‌ఎం, డీగ్రీ వంటి కోర్సులకు మాత్రమే ఎంప్లాయిమెంట్‌ చేయించుకునే అవకాశం జిల్లాలో కల్పిస్తున్నారు. ప్రొఫెషనల్‌ కోర్సుల్లో పాసైనా వారు ప్రతి  సంవత్సరం జిల్లా నుండే లక్షల సంఖ్యలో విద్యార్దులు ఉంటున్నారు. వీరు విశాఖపట్నం, తిరుపతిలకు పోవడానికి సుముఖత వ్యక్తం చేయడం లేదు. చిన్న స్థాయి చదువులకు ఎంప్లాయిమెంట్‌ చేయిస్తే జాబులు రాని పరిస్థితి నెలకొంటే అక్కడకు వెళ్ళి చేయించుకున్నా జాబులు వస్తాయో రావో అని విద్యార్దులు అయోమయంలో ఉన్నారు. ప్రొఫెషనల్‌ కోర్సులకు ఎంప్లాయిమెంట్‌ చేయించాలంటే విశాఖపట్నం జిల్లాలోని ఆంధ్రా యూనివర్సీటి, తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర యూనివర్సిటిలో మాత్రమే ఎంప్లాయిమెంట్‌ చేయించాల్సి రావడంతో ఇతర జిల్లాలకు  చెందిన కొన్ని లక్షల మంది ప్రొఫెషనల్‌ కోర్సులు చేసినవారు అంతదూరం  పోలేక,ఆర్ధిక ఇబ్బందులు తలత్తడంతో చాలామంది విద్యార్దులు ఎంప్లాయిమెంట్‌ చేయించడానికి వెనుకడగు వేస్తున్నారు.అమరావతిలో బీటెక్, ఎంబీఏ, ఎంబీబీఎస్, ఎంఎస్‌సీ వంటి ప్రొఫెషనల్‌ కోర్సులకు ఎంప్లాయిమెంట్‌ చేయించాలంటే విద్యార్దులు నానా అవస్థలు పడాల్సి వస్తుంది.  సెక్రటేరియట్, జిల్లా మంత్రులు, ఇతర మంత్రులు రోజు గుంటూరు, విజయవాడ మీదుగా రాకపోకలు సాగి స్తున్న విద్యార్దులు కష్టాలు పట్టించుకొవడంలో ప్రభుత్వం విఫలమైందినూతనంగా ఏర్పడిన రాజధాని ప్రాంతంలో ఎంప్లాయిమెంట్‌ కార్యాలయం ద్వారా ఉద్యోగవకాశాలు లభిస్తాయో అని ప్రొఫెషనల్‌ కోర్సులు చదివినటువంటి వారు జిల్లా ఎంప్లాయిమెంట్‌ కార్యాలయానికి తమ సర్టిఫికేట్లు తీసుకురావడం తీరా వచ్చాక ఇక్కడ లేదని ఎంప్లాయిమెంట్‌ సిబ్బంది చెప్పడంతో చేసేదిమి లేక అంత దూరం వెళ్ళి ఎంప్లాయిమెంట్‌ చేయించుకొవడానికి ఆర్దిక స్తోమత లేక ఇంటర్, వంటి చిన్న కోర్సుల వరకే ఎంప్లాయిమెంట్‌ చేయించుకొని వెళుతున్నారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు కలిపి దగ్గరలో ఉన్న ఆచార్య నాగార్జున యూనివర్సిటిలో ఏర్పాటు చేస్తే ఎంప్లాయిమెంట్‌ చేయించుకొవడానికి వీలుగా ఉంటుందని విద్యార్థులు కోరుతున్నారు.మా దగ్గరకు రోజూ ప్రొఫెషనల్‌ కోర్సులు చదివిన విద్యార్థులు ఎంప్లాయిమెంట్‌ చేయాలని వస్తున్నారు. కాని ప్రొఫెషనల్‌ కోర్సులకు ఇక్కడ లేదని, విశాఖపట్నం కాని, తిరుపతికి కాని వెళ్లాలని సమాధానం ఇస్తున్నాం. ఏఎన్‌యూలో ఎంప్లాయిమెంట్‌ చేయించడానికి ప్రభుత్వం ప్రతిపాదన ఉంది. కాని ఇంకా అమలు కాలేదని ఉపాధికల్పన అధికారి కె.రజనీప్రియ చెబుతున్నారు.బీటెక్‌ 2014లో పాసయిన రమేష్… బీటెక్‌ డిగ్రీని ఎంప్లాయిమెంట్‌ చేయిద్దామని గుంటూరు ఎంప్లాయిమెంట్‌ కార్యాలయానికి వచ్చాడు. కాని ఇక్కడ అధికారులు ఇక్కడ కాదు వైజాగ్‌ గాని తిరుపతి గాని వెళ్లాలని చెప్పడంతో చేసేదేమీ లేక అంతదూరం వెళ్లలేక ఎంప్లాయిమెంట్‌ చేయించలేదు. చిన్నచిన్న జాబులు చేసుకునే వాళ్లు సెలవులు పెట్టి అంతదూరం వెళ్లి ఎంప్లాయిమెంట్‌ చేయించుకోవడం చాలా కష్టమంటున్నారు.
Tags: Professional degree registrations in the employment offices

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *