లాభాలు వచ్చే పంటలు పండించాలి

సూర్యాపేట ముచ్చట్లు:

 

సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో  వ్యవసాయం పండుగలా మారిందని, రైతన్నలు కాలంతో పోటీ పడుతూ పసిడి సిరులు పండిస్తున్నారని అన్నారు  మంత్రి జగదీష్ రెడ్డి. సూర్యపేట జిల్లా పెన్ పహాడ్ మండలం గాజుల మల్కాపురం గ్రామంలో  రైతులతో కలిసి ఏరువాక కార్యక్రమాన్ని నిర్వహించారు మంత్రి జగదీష్ రెడ్డి. భూమాతకు, పాడికి, వ్యవసాయపని ముట్లకు  పూజలు నిర్వహించిన మంత్రి వ్యవసాయ పనులను ప్రారంభించారు. సీజన్ కంటే ముందే రైతులకు  పెట్టుబడి అందించి, పుష్కలంగా నీళ్లు, 24 గంటల  ఉచిత   కరంట్ ను అందిస్తూ, నకిలీ విత్తనాల బెడద లేకుండా, ముందస్తుగానే ఎరువులను, విత్తనాలను అందుబాటిలో ఉంచడంతో రైతన్నలు చాలా సంతోషంగా ఎరువాకను ప్రారంభించారని  జగదీష్ రెడ్డి అన్నారు. మూస పద్ధతులకు స్వస్థి పలికి లాభాలు వచ్చే పంటలను మాత్రమే సాగు చేయాలని మంత్రి ఈ సందర్భంగా సూచించారు. ఈ వానాకాలం సీజన్ లో కూడా కాళేశ్వరం గోదావరి జలాలు సూర్యపేట జిల్లాకు అందిస్తున్నామని, అన్ని చెరువులను నిపుతున్నామని మంత్రి  తెలిపారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags: Profitable crops should be harvested

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *