రైతులకు లాభాసాటిగా ఎత్తుమడులు పద్ధతి

అదిలాబాద్    ముచ్చట్లు:
ఎత్తు మడుల (రెయిజ్డ్‌ బెడ్స్‌)పై పంటల సాగు ఎన్నో విధాలా మేలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వర్షాలు ఎక్కువగా కురిసినా, తక్కువగా కురిసినా.. అది నల్లరేగడి నేలైనా, ఎర్ర చల్కా నేలలైనా.. అది మెరక పొలమైనా, లోతట్టు ప్రాంతమైనా.. పత్తి /కంది /మిర్చి /పసుపు పంటలైనా లేదా వంగ తదితర కూరగాయ పంటలైనా సరే ఎత్తు మడులపై విత్తుకుంటే మేలు అంటున్నారు.అతివృష్టి, అనావృష్టి కాలాల్లో వత్తిళ్లను తట్టుకోవడమే కాకుండా పంటలు బాగా పెరుగుతాయని, గాలి వెలుతురు బాగా సోకడం వల్ల చీడ పీడల బెడద కూడా తక్కువగా ఉంటుందని, అంతిమం గా అధిక దిగుబడులనిస్తాయని ఆదిలాబాద్‌లోని కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌  చెప్పారు. మూడేళ్ల క్రితం నుంచి ఎత్తుమడులపై పత్తి (4సాళ్లు)+కంది(2సాళ్లు) కలిపి సాగు చేసే పద్ధతిలో సత్ఫలితాలు సాధిస్తున్నారు. అతివృష్టి అయినా, అనావృష్టి అయినా పంటలు దెబ్బతినకుండా ఎకరానికి 13–15 క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తున్నదని చెబుతున్నారు.ట్రాక్టర్‌కు రెయిజ్డ్‌ బెడ్‌ మేకర్‌ పరికరాన్ని అమర్చి వరుసల మధ్య 5 అడుగుల ఎడంతో, అడుగు వెడల్పు (150X30 సెం.మీ.) తో ఎత్తు మడులు తయారు చేస్తున్న దృశ్యంఆరుగాలం కష్టపడే అన్నదాత ప్రతి యేడు ఏదో ఒక రూపంలో నష్టపోతూనే ఉన్నారు. వర్షాలు అధికంగా పడి పంట నీట మునగడం, ఒక్కోసారి సరైన సమయం లో వర్షాలు కురువక పంటలు ఎండిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. అధిక వర్షాలు పడితే నల్లరేగడి పొలం ఉరకెత్తుతుంది. దిగుబడి లోపిస్తుంది. ఎత్తు మడుల విధానంలో లాభాల బాటలోకి పయనించవచ్చని డాక్టర్‌ ప్రవీణ్‌ సూచిస్తున్నాఎత్తు మడులపై పత్తి, కంది మాత్రమే కాదు.. మిర్చి, పసుపుతోపాటు వంగ తదితర కూరగాయలను సాగు చేయవచ్చు అంటున్నారు డా.ప్రవీణ్‌. గతఏడాది 5 ఎకరాల్లో ఈ విధానంలో పత్తి పంట సాగు చేశారు. అధిక వర్షం కురిసినప్పుడు సాళ్లలో నీరు నిల్వ ఉండకుండా బెడ్లుగా తయారు చేసి, వాటిపైన పత్తి విత్తనాలు నాటారు. పత్తి మొక్కల సాళ్ల మధ్య 180X30 సెం.మీ., 150X20 సెం.మీ., 120X30 సెం.మీ.ల దూరంలో ప్రయోగాత్మకంగా పత్తి పంటను సాగు చేశారు.మొక్కకు 80 కాయల వరకు కాచాయి. తక్కువ దూరం పెట్టిన చోట తోట కలిసిపోయి పిచికారీలకు ఇబ్బంది ఏర్పడింది. అందుకని, 150X30 సెం.మీ. (సాళ్ల మధ్యన 5 అడుగులు, మొక్కల మధ్యన ఒక అడుగు దూరం) చొప్పున 4 సాళ్లు పత్తి, 2 సాళ్లు కంది విత్తామని డా. ప్రవీణ్‌ వివరించారు. సాళ్ల మధ్య తగినంత ఖాళీ ఉండడంతో మినీ ట్రాక్టర్‌ ద్వారా కలుపు తీయడానికి అవకాశం ఉంటుందన్నారు. ఎద్దులతో పైపాటు చేసుకునే రైతులు సాళ్ల మధ్య 4 అడుగులు (120 సెం.మీ.) దూరం పెట్టుకున్నా పర్వాలేదన్నారు.

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

 

Tags:Profitable heights method for farmers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *