మహాకూటమిపై చర్చల్లో పురోగతి :కుంతియా

Progress in discussions on mahoutati: Kuntia

Progress in discussions on mahoutati: Kuntia

 Date:17/10/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
కాంగ్రెస్  పార్టీ సీనియర్‌ నేతలు గులాంనబీ ఆజాద్‌, ఏకే ఆంటోనీలను తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కలిశారు. మహాకూటమి, సీట్ల సర్దుబాటు అంశాలపై చర్చించారు. తెదేపా, సీపీఐ, తెజస నేతలతో చర్చించిన అంశాలను కోర్‌కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. );: మహాకూటమిపై చర్చల్లో పురోగతి బాగుందని కుంతియా అన్నారు. భేటీ అనంతరం కుంతియా మీడియాతో మాట్లాడారు. చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని.. త్వరలోనే సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి వస్తుందన్నారు. తెజస, కాంగ్రెస్‌సీట్ల సర్దుబాటు విషయంలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని పార్టీ శ్రేణులను కోరారు.
ఇప్పటికే సీట్ల సర్దుబాటుపై కోదండరాంతో మూడు సార్లు చర్చించినట్లు వివరించారు. ఈ నెల చివరిలోగా సీట్ల సర్దుబాటు పూర్తవుతుందని కుంతియా పేర్కొన్నారు. ఈ నెల 20న రాష్ట్రంలో పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పర్యటిస్తారని, త్వరలో సోనియాగాంధీ కూడా పర్యటించనున్నారని తెలిపారు. కొన్ని స్థానాల్లో కాంగ్రెస్‌ నుంచి ఇద్దరు, ముగ్గురు బలమైన అభ్యర్థులున్నారని.. అందరికీ న్యాయం చేస్తామని వెల్లడించారు. టికెట్‌ రాని వారు నిరాశ చెందొద్దని.. అధికారంలోకి వచ్చాక పార్టీ, ప్రభుత్వంలో పదవులు ఇచ్చి వారికి న్యాయం చేస్తామని అన్నారు.
Tags:Progress in discussions on mahoutati: Kuntia

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *