ఆనందయ్య ఆయుర్వేద మందు పై పరిశోధనలో పురోగతి-చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

తిరుపతి  ముచ్చట్లు :

 

ఆనందయ్య ఆయుర్వేద మందు పై పరిశోధనలో పురోగతి.. టీటీడీ పాలకమండలి సభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నేతృత్వంలో తిరుపతి తుడా కార్యాలయం వేదికగా బుధవారం టీటీడీ ఆయుర్వేద నిపుణులు, ఆనందయ్య కుటుంబ సభ్యులతో భేటీ. జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ అనుమతులు కలిగిన ల్యాబరేటరీ చేర్లోపల్లి సమీపంలో సుజన్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ లో అధ్యయనం అనుకూలతల తీరును పరిశీలించిన టీటీడీ పాలకమండలి సభ్యులు చెవిరెడ్డి, టీటీడీ ఆయుర్వేద వైద్య నిపుణులు. ఆనందయ్య కరోనా మందు పై సానుకూల ఫలితాలు రానున్నాయి. ఆనందయ్య మందును తిరుపతిలోని సృజన లైఫ్ రీసెర్చ్ సెంటర్ లో అధ్యయనం సాగుతోంది.

 

 

 

ప్రభుత్వ పరిశోధనా సంస్థల నుంచి ఆనందయ్య ఆయుర్వేద మందు పట్ల సానుకూల నివేదికలు వస్తే యుద్ద ప్రాతి పదికన ఈ మందు సిద్ధం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో టీటీడీ సిద్దంగా ఉందన్నారు. ఆనందయ్య ఆయుర్వేద మందు ఎంతమంది కరోనా బాధితులకు ఏ ఏ స్థాయిలో అందించారు.. ఎంత మోతాదులో అందించారు.. అనే అంశాలపై ఆనందయ్య కుటుంబ సభ్యుల నుంచి సేకరించినట్లు తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే ఆయుర్వేద మందు విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. కేంద్ర అనుమతి తో ఉన్న ల్యాబ్ ల నుంచి పలితం వస్తే ఈ ఆయుర్వేద మందు ప్రజలకు అందుబాటులోకి తెస్తాం. ఆనందయ్య మందు పై ఒక వైపు టీటీడీ సర్వే చేస్తోంది.. ఆయుష్ విభాగం కూడా సర్వే చేస్తోంది.

 

 

 

ఆయుష్ నుంచి పర్మిషన్ వస్తే ఎంత మంది ప్రజల కైన మెడిసిన్ అందిస్తాం. సుజన్ లాబరేటరీ లో ఆయుర్వేద మందుపై టాక్సికాలజీ స్టడీస్ పరిశోధన ప్రకారం ఎంత మోతాదులో విషతుల్యం అనేది నిర్ధారించనున్నారు. ఈ మందు పరిశీలనకు నెల రోజుల సమయం పడుతుందని పరిశోధన సిబ్బంది పేర్కొన్నారు. ఆ తరువాత 15 రోజులకు పూర్తి స్థాయి పరిశీలన తరువాత ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించనున్నట్లు తెలియజేశారు.

 

బీజీపీ వైపు ఈటెల అడుగులు

 

Tags: Progress in Research on Anandayya Ayurvedic Medicine-Chevireddy Bhaskar Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *