Natyam ad

గృహానిర్మాణాలలో పురోగతి సాధించాలి

-అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు

కడప ముచ్చట్లు:

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలు కార్యక్రమంలో భాగంగా  గృహ నిర్మాణ పనులను లక్ష్యం మేరకు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్ లోని సభాభావనంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సి.ఎం. సాయి కాంత్ వర్మ, డి.ఆర్.ఓ. గంగాధర్ గౌడ్,  హౌసింగ్ పీడి కృష్ణయ్య లతో కలిసి.. జగనన్న హౌసింగ్ కాలనీల్లో గృహ నిర్మాణ పనుల పురోగతిపై.. జిల్లా కలెక్టర్.. హౌసింగ్ అధికారులతో నేరుగా సమీక్షించారు.ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్మాట్లాడుతూ…గృహానిర్మాణాల పురోగతిలో అధికారులపై ఉన్న నమ్మకాన్ని నిలబెటాలన్నారు.  గృహ నిర్మాణ పథకంలో భాగంగా.. చేపట్టిన హౌసింగ్ నిర్మాణ పనుల్లో స్టేజీ కన్వర్షన్ ప్రక్రియను త్వరతిగతిన పూర్తి చేయాలన్నారు. ఆ మేరకు అధికారులందరూ బాద్యతతో పని చేయాలని గ్రామాలు, వార్డుల పరిధిలో.. వన్ టైం సెటిల్మెంట్ (ఓటీఎస్) ప్రక్రియ, స్టేజి కన్వర్షన్, డిజిటల్ సైనింగ్ పనులను యుద్ధప్రాతిపదికన  పూర్తి చేయాలన్నారు. ఆయా మండలాలు, మున్సిపాలిటీల పరిధిలో ఉన్న లే-అవుట్లలో గృహ నిర్మాణ పనుల పురోగతిపై ఒక్కొక్కరిని అడిగి తెలుసుకు న్నారు.

 

 

Post Midle

గృహనిర్మాణ పనులను లక్ష్యం మేరకు పూర్తి చేయాలని.. ఆదేశించారు. అలాగే ముందస్తుగా నే నిర్మాణానికి కావలసిన వాస్తు సామాగ్రిని సంబంధిత అధిరులకు తెలిపి తెప్పించుకోవలని అన్నారు. ఆయా గ్రామ పరిధిలో తప్పక గ్రామ సచివాలయాల భవనాలు,  రైతు భరోన కేంద్రాలను, ఆరోగ్య కేంద్రాలను సకాలంలో పూర్తి చేయాలని అన్నారు.  ఇందులో  ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో కడప, బద్వేలు, జమ్మలమడుగు, పులివెందుల రెవెన్యూ డివిజన్ల.. ఆర్డీవోలు ధర్మచంద్రారెడ్డి, వెంకట రమణ, శ్రీనివాసులు, వెంకటేష్ లతో నియోజకవర్గ, మండల ప్రత్యేకధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహశీల్దార్లు, ఎంపిడివోలు, హౌసింగ్, అధికారులు, ఇంజనీర్లు తదితరులు హాజరయ్యారు.

 

Tags: Progress should be made in housing construction

Post Midle

Leave A Reply

Your email address will not be published.