26 న అభ్యుదయ సాహిత్య ఉపన్యాసాలు
కడప ముచ్చట్లు:
యోగి వేమన విశ్వవిద్యాలయం అధీనంలోని సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం ఆధ్వర్యంలో అభ్యుదయ సాహిత్యోపన్యాసాలు 7వ సదస్సును ఈ నెల 26 ఆదివారం ఉదయం 10 గంటలకు బ్రౌన్ శాస్త్రి సమావేశ మందిరంలో నిర్వహిస్తున్నట్లు సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం బాధ్యులు డా మూల మల్లికార్జున రెడ్డి పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా వైవియూ కులసచివులు ఆచార్య దుర్భాక విజయ రాఘవప్రసాద్, సభాధ్యక్షులుగా పరీక్షల నియంత్రణాధికారి డా. ఎన్.ఈశ్వరరెడ్డి, విశిష్ట అతిథిగా సాహితీ పరిశోధకులు డా తవ్వా వెంకటయ్య (ఖాజీపేట), గౌరవ అతిథిగా యువ కథారచయిత షేక్ షబ్బీర్ హుస్సేన్, ప్రధాన వక్తగా శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖ అధ్యాపకులు ఆచార్య ఆర్.రాజేశ్వరమ్మ, ఉపన్యాస వ్యవస్థాపకులు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ డా.పి.సంజీవమ్మ, ఆకాశవాణి పూర్వ సంచాలకులు డా.తక్కోలు మాచిరెడ్డి పాల్గొంటారన్నారు.ప్రధాన వక్త ఆచార్య ఆర్.రాజేశ్వరమ్మ ‘కడపజిల్లా అభ్యుదయ కథానికా సాహిత్యం’ అనే అంశంపై ప్రసంగిస్తారని, సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం బాధ్యులు డా. మూల మల్లికార్జున రెడ్డి సభా నిర్వహణ చేస్తారని అన్నారు.
Tags: Progressive Literary Lectures on the 26th

