తిరుపతి ముచ్చట్లు:
ఎర్ర వారి పాలెం, బుచ్చేపల్లి అడవి ప్రాంతంలో మెరుపు దాడులు జరిపిన పోలీసులు.400 లీటర్ల నాటు సారా ఊట ధ్వంసం చేసిన ఎర్రవారిపాలెం పోలీసులు.చట్టాన్ని అతిక్రమించి ఎవరైనా మత్తు పదార్థాల తయారీకి ఉపక్రమిస్తే, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు షీట్స్ కూడా ఓపెన్ చేస్తాం.జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపిఎస్.27.08.2024 వ తేదీన జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపిఎస్., ఆదేశాల మేరకు చంద్రగిరి ఇన్చార్జ్ డిఎస్పి నరసింగప్ప పర్యవేక్షణలో ఎర్ర వారి పాలెం ఎస్సై డివై స్వామీ తన సిబ్బందితో బుచ్చేపల్లి అటవీ ప్రాంతం.. నాటు సారా తయారీ కేంద్రాలపై జరిపిన ఆకస్మిక దాడులలో భాగంగా 400 లీటర్ల నాటు సారా ఊట ను గుర్తించి, ధ్వంసం చేశారు.అసాంఘిక.. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే ఉద్దేశంతో చట్టాన్ని అతిక్రమించి ఎవరైనా మత్తు పదార్థాల తయారీకి ఉపక్రమిస్తే, అట్టి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు షీట్స్ కూడా ఓపెన్ చేస్తామని పదేపదే అతిక్రమిస్తే పీడీ-యాక్ట్ ప్రయోగించి కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.మత్తు పదార్థాల తయారీ జిల్లాలో పూర్తిగా అరికట్టాలంటే జిల్లా ప్రజల సహకారం ఎంతైనా అవసరం.. బాధ్యత గల పౌరులుగా మీకు తెలిసిన సమాచారాన్ని పోలీస్ వారికి తిరుపతి జిల్లా పోలీస్ వాట్సాప్ నెంబర్ 8099999977 కు లేదా డయల్ 100 కు గానీ తెలియజేసి మీరు కూడా భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు… సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచి, ఖచ్చితమైన సమాచారం ఇచ్చిన వారికి రివార్డులను కూడా అందిస్తామని జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
Tags:Prohibition of manufacture of intoxicating substances like natu sara.