క్రీడలకు ప్రోత్సహం

Date:25/06/2019

కర్నూలు ముచ్చట్లు:

క్రీడాకారునికి ప్రపంచ వ్యాప్తంగా  గుర్తింపు వుంటుందని ప్రతి విద్యార్ధి క్రీడాస్పూర్తిని అలవర్చుకోవాలని శాసనమండలి సభ్యులు  కె.ఇ ప్రభాకర్ అన్నారు. మంగళవారం స్థానిక  అవుట్ డోర్ స్టేడియంలో నిర్వహించిన 33వ ఒలంపిక్  క్రీడోత్సవాలలో  ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. పాణ్యం, కోడుమూరు ఎమ్మేల్యేలు కాటపాని రాంభూపాల్  రెడ్డి, డా. జే.సుధాకర్ , కెడిసిసి చైర్మన్ మల్లికార్జున రెడ్డి, మాజీ ఎమ్మేల్యే ఎస్.వి. మోహన్ రెడ్డి, జిల్లాక్రీడాభివృద్ది అధికారి అధినారాయణ, డిఇఓ  తెహరా సుల్తానా తదితరులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా కె.ఈ ప్రభాకర్ మాట్లాడుతూ  విద్యార్ధులందరూ   చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. పాణ్యం ఎమ్మెల్యే  కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ గత 30 సంవత్సరాల  నుండి  ఒలింపిక్   డే రన్  నిర్వహించు  కుంటున్నామన్నారు.  పార్టీల కతీతంగా సభ్యులందరూ పాల్గొనడం  శుభదాయకమన్నారు. ప్రతి  పాఠశాలలో విద్యార్ధులుఆడుకునేందుకు అవకాశం కల్పించాలని డిఇఓను సూచించారు. పిల్లలు  శారీరకంగా ఎదుగుదల వుంటేనే  చదువులో ఉన్నత స్థితికి చేసుకుంటారన్నారు. రాజకీయ నాయకుల కంటే క్రీడాకారునికి మంచి క్రేజ్ వుంటుందన్నారు. కోడుమూరు ఎమ్మేల్యే డా.జే.సుధాకర్ మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం పేద విద్యార్ధులకు అనేక సౌకర్యలు కల్పిస్తున్న నేపథ్యంలో  క్రీడలకు సంబంధిత అంశాల్లో సమస్యలుంటే తన దృష్టికి తేవాలని పాఠశాలల సూచించారు. అంతకుముందు  జాంయిట్ కలెక్టర్ రవి పటాన్ శెట్టి క్రీడా జ్యోతితో ఒలింపిక్ డే రన్ విద్యార్ధులకు ప్రోత్సహమిచ్చారు.

 

పట్టపగలే దారుణ హత్య

 

Tags: Promotion to sports

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *