Natyam ad

అర్జీదారుల సమస్యల పై సత్వర చర్యలు తీసుకోవాలి-జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు

కడప ముచ్చట్లు:


ప్రజా సమస్యల పరిష్కారార్థం ఏర్పాటు చేసిన   “స్పందన”   కార్యక్రమం ద్వారా స్వీకరించిన  అర్జీదారుల సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని అన్ని శాఖల  అధికారులను  జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్లోని స్పందన హాల్లో..    ప్రజా ఫిర్యాదుల స్వీకరణ “స్పందన”  కార్యక్రమం  జరిగింది.  ఈ  కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు తో పాటు జేసి సాయికాంత్ వర్మ,    డిఆర్వో గంగాధర్ గౌడ్, స్పెషల్ కలెక్టర్ రామమోహన్, డ్వామ  పీడి యదుభూషన్ రెడ్డి,  ,  స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు నరసింహులు, చంద్రమోహన్,  అనుడ విసి శ్రీలక్ష్మి  లు హాజరై ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు.  

 


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు మాట్లాడుతూ  ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు .. క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి, అర్జీదారుడు సంతృప్తిచెందేలా  నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు.   పెండింగ్ బియాండ్ ఎస్ఎల్ఏ, రీఓపెనింగ్.. లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలాఅర్జీలనుపరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో  సిపివో వెంకట రావు, డి ఎం అండ్ హెచ్ ఓ డా. నాగరాజు, రిమ్స్ సూపర్ ఇన్ టెన్ డెంట్ డా. వెంకటేశ్వర రావు,  మెప్మా  పీడి రామమోహన్ రెడ్డి,   ఐసిడిఎస్ పీడి రాణి, ఆర్ & బి ఎస్ ఈ  మహేశ్వర రెడ్డి,  గృహనిర్మాణ శాఖ పీడి కృష్ణయ్య,    వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Prompt action should be taken on the problems of the petitioners-District Collector V.Vijay Ramaraju

Post Midle

Leave A Reply

Your email address will not be published.