వర్షంలో తుమ్మల ప్రచారం

ఖమ్మం ముచ్చట్లు:

ఖమ్మం పట్టణం లోని   వన్ టౌన్ లోని చెరువు బ్రదర్ , తుమ్మల గడ్డ,  ప్రాంతాలలో స్థానిక మహిళలు,యువకులు,  కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తుమ్మల కు స్వాగతం పలికి భారీ ర్యాలీ తీశారు.  తుమ్మలగడ్డ ప్రాంతంలో  ర్యాలీ నిర్వహిస్తున్న సమయంలో భారీ వర్షం  కురిసింది.  భారీ వర్షంలో కూడా  ర్యాలీ కి వచ్చిన మహిళల ఉత్సాహాన్ని చూసి  తుమ్మల వర్షంలో కూడా ప్రసంగించారు.  తుమ్మల మాట్లాడుతూ ఇంతటి వర్షాన్ని కూడా లెక్కచేయకుండా  నాకోసం  వచ్చిన మహిళలకు స్థానిక ప్రజలకు  కృతజ్ఞతలు.  ఈ సమయంలో వర్షం రావడం శుభ సూచకం. కాబట్టి  రాబోయే 20 రోజులు  ఎన్నికలకు సమయం ఉన్నప్పటికీ ఏమాత్రం తగ్గేదే లేదన్నట్టుగా  కాంగ్రెస్ పార్టీని దీవించాలని కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని వచ్చినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.  సోనియా గాంధీ ప్రవేశపెట్టిన  6 గ్యారంటీలో ఎక్కువ శాతం మహిళలకే  లాభం చేకూరే విధంగా  ఉందని అన్నారు.

 

Tags: Propagation of sneezes in the rain

Post Midle
Post Midle