ఆస్తిపన్ను పెంపుదల వెంటనే ఉపసంహరించాలి-  జనసేన పార్టీ డిమాండ్

అనంతపురం ముచ్చట్లు:

 

గత 16 నెలల నుంచి రాష్ట్ర ప్రజలు కరోనాతో ఎటువంటి ఆర్థిక వనరులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి  సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆస్తిపై,చెత్తపై పన్నులు పెంచడం చాలా దారుణమైన విషయం, దీనివలన బాడుగలు పెరిగి అవి కట్టలేక ఆర్థికంగా ఇబ్బంది పడతారని అనంతపురం జిల్లా కదిరి జనసేన పార్టీ ఇంచార్జ్ భైరవ ప్రసాద్ తెలియజేశారు . ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను  కాపాడాల్సిన  ప్రభుత్వమే  ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో  పన్నులను పెంచి ప్రజలను ఇబ్బందులకు    గురిచేయడం  మంచి పద్ధతి కాదని  తెలియజేశారు .రాష్ట్ర ప్రభుత్వం  ప్రజల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వెంటనే ఆస్తిపన్ను పెంపుదలను నిలిపివేయాలని లేనిపక్షంలో ప్రభుత్వానికి ప్రజల నుంచి వ్యతిరేకత, ఆందోళనలు   తప్పవని హెచ్చరించారు.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

 

Tags:Property tax hike should be withdrawn immediately – Janasena party demands

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *