సీఎం ను కలిసిన ప్రబోధానంద అనుచరులు

 Date:08/10/2018
విజయవాడ  ముచ్చట్లు:
మాపై అక్రమ కేసులు పెడుతున్నారు.. బలవంతంగా ఆశ్రమం ఖాళీ చేయిస్తున్నారు.. జేసీ బ్రదర్స్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. పోలీసులు పట్టించుకోవం లేదు..జేసీ బ్రదర్స్ వర్సెస్ ప్రబోధానంద.. తాడిపత్రి సెంటర్‌గా సాగుతున్న ఈ వివాదం అమరావతికి చేరింది. సోమవారం ఉదయం ప్రబోధానంద అనుచరులు అమరావతికి భారీగా, ర్యాలీగా తరలివచ్చారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం దగ్గరకు వెళ్లారు. జేసీ సోదరుల అకృత్యాలు పెరిగిపోయాయని.. తమకు రక్షణ కల్పించాలని సీఎంను కోరడానికి వచ్చామన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా సరిగా పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఆశ్రమంలోని భక్తుల్నిబలవంతంగా ఖాళీ చేయిస్తున్నారని ఆరోపించారు ప్రబోధానంద భక్తులు. తమపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని.. సీఎం చంద్రబాబు చొరవ తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఐదు రాష్ట్రాల నుంచి ప్రబోధానంద ఆశ్రమానికి భక్తులు వస్తున్నారని.. స్వామికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయనే అక్కసుతో జేసీ బ్రదర్స్ టార్గెట్ చేశారని ఆరోపించారు. వినాయన నిమజ్జన సమయంలోనూ జేసీ అనుచరులే మహిళల్ని దూషించి గొడవకు దిగారని ఆరోపించారు.
Tags:Proponents of the Prophet who met the CM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *