Proporcionamos pensiones para todos los que son elegibles

అర్హులందరికి పెన్షన్లు అందిస్తాం

– పది రోజుల్లో 210 మందికి మంజూరు

Date:20/06/2020

పుంగనూరు ముచ్చట్లు:

మండలంలోని అర్హులైన లబ్ధిదారులందరికి పెన్షన్లు అందజేస్తామని ఎంపీపీ అభ్యర్థి అక్కిసాని భాస్కర్‌రెడ్డి తెలిపారు. శనివారం ఎంపీడీవో లక్ష్మీపతినాయుడు ఆధ్వర్యంలో 210 మందికి పెన్షన్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి భాస్కర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి హాజరై పంపిణీ చేశారు. భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ పది రోజుల్లో సచివాలయల ద్వారా ధరఖాస్తు చేసుకున్న 210 మందికి పెన్షన్లు అందజేయడం జరిగిందన్నారు. అలాగే మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనల మేరకు అన్ని రకాల సేవలను సచివాలయాలలో అందజేయడం జరుగుతోందన్నారు. ప్రజల సమస్యలను గుర్తించేందుకు వలంటీర్లు తమకు కేటాయించిన ఇండ్లకు వెళ్లి సమస్యలను గుర్తించి, సచివాలయాలలో నమోదు చేసి పరిష్కరించడం జరుగుతోందన్నారు. ఈ విధంగా ప్రజలకు ఎప్పటికప్పుడు సేవలు అందించేందుకు సచివాలయ ఉద్యోగులు ఆహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు. ప్రజలు ఎవరైనా తమ సమస్యల పరిష్కారం కోసం సచివాలయాలకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కార్యదర్శి చంద్రారెడ్డి యాదవ్‌, పార్టీ మండల అధ్యక్షుడు విజయభాస్కర్‌రెడ్డి, పార్టీ యువజన సంఘ నాయకులు రాజశేఖర్‌రెడ్డి, వెంకట్రమణ, మాజీ సర్పంచ్‌ పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఏపిలో పది పరీక్షలు రద్దు – ఇంటర్‌ సఫ్లిమెంటరీ రద్దు

Tags: Proporcionamos pensiones para todos los que son elegibles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *