Natyam ad

పుంగనూరులో ఏరియా ఆసుపత్రిగా మార్పుకు ప్రతిపాదనలు

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని ఎన్‌ఎస్‌.పేటలో ఉన్న ప్రభుత్వాసుపత్రిని ఏరియా ఆసుపత్రిగా మార్పు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు ఆసుపత్రి అభివృద్ధి కమిటి చైర్మన్‌ డాక్టర్‌ శరణ్‌కుమార్‌ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాసుపత్రిలో గతవారం నలుగురు డాక్టర్లు బదిలీ అయ్యారని తెలిపారు. సర్జన్లను నియమించేందుకు ఆసుపత్రిని ఏరియా ఆసుపత్రిగా మార్చి 24 గంటలు వైద్యసేవలు అందించేందుకు రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్యమంత్రికి ప్రతిపాదనలు పంపారని తెలిపారు. త్వరలోనే ఏరియా ఆసుపత్రిగా పుంగనూరు ఆసుపత్రిగా మార్పులు జరుగుతోందన్నారు. తగిన డాక్టర్లను నియమించి వైద్యసేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిధున్‌రెడ్డిల సహకారంతో ఆసుపత్రిలో ఆక్సిజన్‌ ప్లాంటు, వెంటిలేటర్లు, చిన్నపిల్లల వార్డు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్రజల ఆరోగ్యం కోసం వేల కోట్లు ఖర్చు చేసి ప్రజలను ఆదుకోవడం జరుగుతోందని కొనియాడారు.

 

Post Midle

Tags: Proposals for conversion to Area Hospital at Punganur

Post Midle

Leave A Reply

Your email address will not be published.