Natyam ad

పుంగనూరులో మౌళిక వసతులకు రూ.12 కోట్లతో ప్రతిపాదనలు – కమిషనర్‌ నరసింహప్రసాద్‌

– పారిశుద్ధ్యం మెరుగు
-272 మందికి నూతన పెన్షన్లు

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

మున్సిపాలిటి పరిధిలోని 16 సచివాలయాలలో మౌళిక వసతుల ఏర్పాటుకు రూ.12 కోట్లతో ప్రతిపాదనలు పంపుతున్నట్లు కమిషనర్‌ నరసింహప్రసాద్‌ మంగళవారం తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ పట్టణంలోని 31 వార్డులలో గల విస్తరణ ప్రాంతాలలో గల కాలువలు, రోడ్లు ఏర్పాటు చేస్తామన్నారు. పట్టణంలో సచివాలయాల ద్వారా ధరఖాస్తు చేసుకున్న 272 మంది పేదలకు పెన్షన్లు మంజూరు చేయాల్సిందిగా ప్రతిపాదనలు పంపినట్లు కమిషనర్‌ తెలిపారు. జనవరి నుంచి అందిన అర్జీలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడం జరిగిందన్నారు. వీటిని ప్రభుత్వం విచారణకు పంపిందన్నారు. విచారణలో ధరఖాస్తు దారులు 272 మంది పెన్షన్‌కు అర్హులుగా నిర్ధారణ కావడంతో నివేదికలు ప్రభుత్వానికి పంపామన్నారు. నిధులు విడుదల కాగానే లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే మున్సిపాలిటిలో వివిధ రకాల మౌళిక వసతుల ఏర్పాటుకు సుమారు రూ.12 కోట్ల రూపాయలు నిధులు అవసరమని నివేదికలు తయారు చేసి చైర్మన్‌ అలీమ్‌బాషాతో కలసి మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అందజేయనున్నట్లు తెలిపారు. మున్సిపాలిటిలో పారిశుద్ధ్యం, మంచినీటి సమస్యలు లేకుండ ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. పారిశుద్ధ్య కార్యక్రమాలలో ఎలాంటి సమస్యలు ఎదురైనా తక్షణమే తన దృష్టికి తీసుకురావాలని ప్రజలను కోరారు. పారిశుద్ధ్య కార్యక్రమాలను సచివాలయాల ద్వారానే నిర్వహిస్తున్నామని, దీని ద్వారా పారిశుద్ధ్యం మెరుగుపడిందని తెలిపారు.

 

Tags: Proposals with Rs 12 crore for infrastructure in Punganur – Commissioner Narasimha Prasad

 

Post Midle